సుశాంత్‌పై మొసలి కన్నీళ్లు కార్చొద్దు.. మీ క్రూర ప్రవర్తనతోనే.. కరణ్ జోహర్, ఆలియాపై నెటిజన్ల ధ్వజం

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ హిందీ చిత్రసీమలో భూకంపం సృష్టించేలా ఉంది. గత కొద్దికాలంగా ఇండస్ట్రీలో బంధుప్రీతి, తమకు నచ్చిన వాళ్లకు, స్టార్ హీరోల పిల్లలకే అవకాశాలు ఇస్తున్నారు. ప్రతిభావంతులను పరిశ్రమ పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఆ ఆరోపణలు ఒక్కసారిగా ఊపందుకొన్నాయి. సెలబ్రిటీలతోపాటు పలువర్గాల నుంచి మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కరణ్, ఆలియా తీరును దుయ్యబడుతూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. నెటిజన్ల ఆగ్రహం ఎలా ఉందంటే..

Recommended Video

Why Alia Bhatt And Karan Johar Are Trending? | Sushant Singh Rajput
సుశాంత్ మృతిపై ఆలియాభట్ సంతాపం

సుశాంత్ మృతిపై ఆలియాభట్ సంతాపం

సుశాంత్ మరణవార్త బయటకు రాగానే ఆలియా భట్ స్పందిస్తూ.. నేను తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయాను. నాకు ఎలాంటి బాధ కలిగిందనే విషయాన్ని పక్కన పెడితే.. నా నోట మాటలు రావడం లేదు. అయితే పూర్తిగా షాక్ గురయ్యాను. మేమంత నిన్ను మిస్ అవుతున్నాం. సుశాంత్ ఫ్యామిలీకి, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని అలియా భట్ ట్వీట్ చేశారు.

 కరణ్ జోహర్ శ్రద్దాంజలి ఇలా

కరణ్ జోహర్ శ్రద్దాంజలి ఇలా

ఇక కరణ్ జోహర్ ట్వీట్ చేస్తూ.. సుశాంత్ మరణ వార్త విని నా హృదయం ఒక్కసారిగా ముక్కలైంది. మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం తాలుకూ మెమొరీస్ నన్ను వెంటాడుతున్నాయి. ఇంకా సుశాంత్ లేరనే వార్తను నమ్మలేకపోతున్నాను. నా స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయనతో ఉన్న మెమొరీస్ మాత్రమే బాధను తగ్గిస్తాయి అంటూ కరణ్ జోహర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాలీవుడ్ మాఫియా అంటూ ఆరోపణలు

బాలీవుడ్ మాఫియా అంటూ ఆరోపణలు

ఇలా ఆలియా, కరణ్ ట్వీట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే నెటిజన్లు, కంగన లాంటి ప్రముఖ సినీ తారలు మండిపడ్డారు. బాలీవుడ్ ఎలైట్ క్లబ్, బాలీవుడ్ మాఫియా అంటూ ట్రెండ్ చేయడంతో వారిద్దరూ జాతీయ వ్యాప్తంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారారు. వారిద్దరివి కపట నాటకాలు, మొసలి కన్నీళ్లు అంటూ దుయ్యబట్టారు. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ ధ్వజమెత్తారు.

సుశాంత్‌ను ఎన్నడూ గౌరవించలేదు

సుశాంత్‌ను ఎన్నడూ గౌరవించలేదు

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎన్నడూ సుశాంత్ సింగ్‌ను అక్కున చేర్చుకోలేదు. అతడు సాధించిన విజయాలను గౌరవించలేదు. అతడు బతికి ఉన్నప్పుడు.. తమ నుంచి సహకారం ఆశిస్తే దూరం పెట్టారు. ఇప్పుడు ఆయన మరణంపై సానుభూతిని కురిపిస్తున్నారు. ఇలాంటి హిపోక్రసిని భరించలేం. సుశాంత్ లాంటి నటుడు, వ్యక్తి బాలీవుడ్‌లో వెతికినా కనిపించడు అని నెటిజన్లు మండిపడుతున్నారు.

 బాలీవుడ్ క్రూర ప్రవర్తనతోనే

బాలీవుడ్ క్రూర ప్రవర్తనతోనే

క్రూరమైన ప్రవర్తన కలిగిన బాలీవుడ్‌ను చూస్తే సిగ్గేస్తుంది. యువతకు బాలీవుడ్ నుంచి సపోర్టు లభించడం లేదు. సుశాంత్ లాంటి ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోవడం బాధాకరం. ఆయన మరణంతో మేము మంచి నటుడిని కోల్పోయాం. ఇలాంటి నటుడిని దూరం చేసుకొన్న బాలీవుడ్‌ను బహిష్కరిద్దాం అని పిలుపునిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X