మహిళా నాయకురాలిపై కరణ్ జోహార్ సెటైర్లు.. దుమ్ముదులిపేశాడు!
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడూ సరదాగా కనిపిస్తారు. కానీ ఈ సారి ఆయన హాస్యం మిస్ ఫైర్ కావడంతో చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఫలితంగా క్షమాపణ చెప్పేవరకు వ్యవహారం వెళ్ళింది. బిజెపి నేత, టివి నటి అయిన కిరణ్ ఖేర్ పై వేసిన జోకులు ఈశాన్య భారత ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా చేశాయి. విమర్శలు ఎదురుకావడంతో కరణ్ జోహార్ వెంటనే సోషల్ మీడియా పోస్ట్ ని తొలగించారు.

ఇండియాస్ గాట్ టాలెంట్ 6 షో
కరణ్ జోహార్, టివి నటి కిరణ్ ఖేర్ ఇద్దరూ ఇండియాస్ గాట్ టాలెంట్ 6 డాన్స్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ ఖేర్ నార్త్ ఈస్ట్ ప్రజలు ధరించే టోపీతో కనిపించింది. ఈ టోపీపై కరణ్ జోహార్ జోకులు పేల్చాడు. ఆ వీడియోని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది.

ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావ్
కిరణ్ ఖేర్ ని చూడగానే.. ఓ మై గాడ్.. నీ తలపై ఉన్నదేంటి.. ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు.. నీకు ఇంకేమి టోపీలు దొరకలేదా అంటూ వ్యాఖ్యానించాడు. ఈ టోపీ తనకు నార్త్ ఈస్ట్ ప్రజలు గిఫ్ట్ గా ఇచ్చారని కిరణ్ ఖేర్ తెలిపింది. వాళ్ళు నీ కోసం కూడా ఒక టోపీ ఇచ్చారని అంది. దానికి కరణ్ జోహార్ బదులిస్తూ.. నాకు వద్దు.. నీ అంత ధైర్యం నాకు లేదు అంటూ హాస్యాస్పదంగా వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్సే దుమారంగా మారాయి.
అస్సాం వ్యకి ఘాటుగా
కరణ్ జోహార్ వీడియో గమనించిన ఓ నార్త్ ఈస్ట్ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. కరణ్ జోహార్ గారు.. ఎవరైనా మీకు గిఫ్ట్ గా ఇస్తే దానిని కించపరచకూడదనే విషయం తెలుసుకోండి. మీ వ్యాఖల వలన నార్త్ ఈస్ట్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని తెలిపాడు.

అనుకోకుండా జరిగింది
వివాదం మరింత పెద్దది కాకుండా కరణ్ జోహార్ వెంటనే స్పందించి క్షమాపణలు తెలియజేశారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా స్పందించలేదు అని కరణ్ జోహార్ వివరణ ఇచ్చారు. నాకు భారత దేశంలోని అన్ని సంప్రదాయాలపై గౌరవం ఉందని కరణ్ జోహార్ అన్నారు.


Click it and Unblock the Notifications











