సల్మాన్ ఖాన్‌ని కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుంటే.. షో మధ్యలో అర్జెంట్ అంటూ లేచిన స్టార్ హీరో!

బాలీవుడ్ తారలు, ప్రముఖులంతా ప్రస్తుతం బుల్లి తెరపై కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో బాలీవుడ్ లో వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఎంతటి వివాదాస్పదమైన ప్రశ్ననైనా కరణ్ జోహార్ మొహమాటపడకుండా సింపుల్ గా అడిగేస్తున్నాడు. ఈ షోకు అతిధులుగా హాజరైన సెలెబ్రిటీలు అంతే సరదాగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ షోలో ఇటీవల కత్రినా కైఫ్, వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ఉత్కంఠని రేకెత్తిస్తోంది.

సరదా సరదాగా

సరదా సరదాగా

కత్రినా కైఫ్, వరుణ్ ధావన్ పాల్గొన్న ఈ షోకు సంబంధించిన ప్రోమో చాలా సరదాగా ఉంది. వరుణ్ ధావన్, కత్రినా కైఫ్ కలసి కరణ్ జోహాన్ ని పైకి ఎత్తేస్తున్నారు. వరుణ్, కరణ్ ఇద్దరూ వెరైటీగా హై ఫైని కాలితో ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి సరదా సరదా సన్నివేశాల మధ్య సాగే ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.

వరుణ్ ధావన్‌తో పెళ్లి

వరుణ్ ధావన్‌తో పెళ్లి

కరణ్ జోహార్ మాట్లాడుతూ.. కత్రినా నీవిప్పుడు సింగిల్ గా ఉన్నావు కదా.. వరుణ్ ధావన్ ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో కత్రినా చాలా సిగ్గు పడిపోయింది. ఇక కరణ్ జోహార్.. వరుణ్ ధావన్ ని అడిగిన ప్రశ్న అయితే అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రశ్నకు వరుణ్ ఎలాంటి సమాధానం ఇచ్చి ఉంటాడు అని అంతా ఎదురుచూస్తున్నారు.

కత్రినా, సల్మాన్ ఖాన్ పెళ్లి

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని భావిస్తున్నావు అంటూ కరణ్ జోహార్ వరుణ్ ధావన్ ని అడుగుతాడు. ఈ ప్రశ్నకు వరుణ్ సమాధానం ప్రోమోలో చూపించలేదు.

చిన్న పిల్లాడిలా అర్జెంట్ అంటూ

చిన్న పిల్లాడిలా అర్జెంట్ అంటూ

షో సరదాగా జరుగుతున్న సమయంలో వరుణ్ ధావన్ చిన్న పిల్లాడిలా పైకి లేచి నాకు అర్జెంట్.. పాస్ పోసుకోవాలి అని అడిగేస్తాడు. దీనికి బదులుగా కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఇది చాలా క్లాసీ షో.. పాస్ పోసుకోవడం ఏంటి అని అడుగుతాడు. దీనికి వరుణ్ ఇచ్చిన సమాధానం పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఏం.. క్లాస్ గా ఉండేవాళ్ళు పాస్ పోసుకోరా అని వరుణ్ ధావన్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X