‘నన్ను అప్పుడే చంపొద్దు.. నా పిల్లల కోసం చాలా ఏళ్లు బతకాలని ఉంది’
చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ఎఫైర్స్, బ్రేకప్, ప్రేమాయణాలతో పాటు వారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో గాలివార్తలు చక్కర్లు కొడుతుంటాయి. ఎవరైనా నటుడు ఆసుపత్రిలో చేరినా, ఫేస్‌లో ఏమాత్రం తేడా కనిపించినా వారికి భయంకరమైన వ్యాధి ఉందని త్వరలోనే చనిపోతాడని గాసిప్స్ వస్తుంటాయి. ఇలాంటి ఫేక్ న్యూస్‌కు బలైన సెలబ్రెటీలు ఎంతోమంది ఉన్నారు. కొందరు వీటిపై సీరియస్ అయితే.. ఇంకొందరు మాత్రం చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. ఈ వివరాల్లోకి వెళితే..
అందంపై కరణ్ ఫోకస్
అందానికి, ఆరోగ్యానికి సెలబ్రెటీలు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ రంగంలో అందమే పెట్టుబడి. ఎంతకాలం వారి శరీరం ఫిట్‌గా ఉండి, అందంగా కనిపిస్తారో అప్పటి వరకు వారి కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. శరీరంలో ఏమాత్రం మార్పులు వచ్చినా డౌన్‌ఫాల్ ప్రారంభం కావడం తథ్యం. అందం కాపాడుకోవడం కోసం కాస్మోటిక్స్ సర్జరీలు చేయించుకుని ప్రాణాల పొగొట్టుకున్న వారూ ఉన్నారు. అయితే కొందరు స్టార్స్ మాత్రం ఉన్నపళంగా బరువు పెరుగుతారు. అంతే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ హఠాత్తుగా బరువు తగ్గడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

ఎముకలా గూడులా కరణ్
50 ఏళ్లు దాటినా ఫిట్‌గా ఉండటానికి, అందంగా కనిపించడానికి కరణ్ జోహార్ ప్రాధాన్యత ఇస్తారు. సిక్స్ ప్యాక్ బాడీతో తొలి నుంచి స్లిమ్‌గానే కనిపించేవారు కరణ్. అయితే కొద్దిరోజుల క్రితం ట్రైటర్స్ అనే రియాలిటీ షోలో కరణ్ లుక్ అభిమానులకు షాకిచ్చింది. ఎముకల గూడులా, బక్కచిక్కిపోయి, ముఖంలో చావు కళ ఉట్టిపడేలా ఉంది. కరణ్ వేగంగా బరువు తగ్గడానికి ఓజెంపిక్ అనే ఇంజెక్షన్‌ను ఉపయోగిస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఆయన తక్షణం స్పందించారు. కఠినమైన డైట్, ఆహారపు అలవాట్ల కారణంగానే తాను ఒక్కసారిగా బరువు తగ్గానని.. ఎలాంటి ఇంజెక్షన్లు తీసుకోలేదని కరణ్ జోహార్ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కరణ్ జోహార్ ఆరోగ్యం విషమించిందని, ఆయన చావు బతుకుల్లో ఉన్నారని, కొందరైతే ఏకంగా కరణ్ చనిపోయాడని ఫేక్ న్యూస్ వైరల్ చేశారు. దీంతో తన వెయిట్ లాస్‌పై మరోసారి స్పందించారు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
దఢక్ 2 ట్రైలర్ లాంచ్
2018లో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన దఢక్ మూవీకి సీక్వెల్‌గా దఢక్ 2ని తెరకెక్కించారు. తృప్తి దిమ్రి, సిద్ధాంత్ చతుర్వేదిలు జంటగా నటించగా.. షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియెస్, ధర్మా ప్రొడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా తదితరులు సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 1న దఢక్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
అప్పుడే చంపొద్దు
ధడక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన కరణ్ జోహార్ మాట్లాడుతూ.. తాను పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని, కానీ నెటిజన్లు తనను ఏకంగా చంపేశారని కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నా పిల్లల కోసం మరికొంతకాలం బతకాలని అనుకుంటున్నానని, తనను అప్పుడే చంపేయొద్దని ఆయన క్లాస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కరణ్ జోహార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











