అతన్ని గుడ్డిగా నమ్మి మోసపోతున్న జాన్వీ కపూర్.. కెరీర్‌పై ఎఫెక్ట్!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారాలి అంటే చాలా కష్టమైన పని. ముఖ్యంగా పోటీ ఎక్కువవుతున్న ఈ రోజుల్లో నిలదొక్కుకోవాలి అంటే ప్రేక్షకులను ఎంతో కొంత కొత్తగా ఎట్రాక్ట్ చేయాలి. ఇకపోతే వారసత్వం బాధ్యతలు తీసుకుంటే ఆ భారం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటోంది. ఒక వ్యక్తిని నమ్మి జాన్వీ మోసపోతోంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

అతిలోక సుందరిగా..
శ్రీదేవి అంటే జనాల దృష్టిలో ఒక అతిలోక సుందరిగా ముద్ర పడిపోయింది. అలాంటి హీరోయిన్ కూతురిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే జాన్వీ కపూర్ మాత్రం ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోతోంది. ఒక వ్యక్తి కారణంగా ఆమె తన కెరీర్ ప్రాజెక్టుల గురించి సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు.

గాడ్ ఫాథర్..
జాన్వీ కపూర్ కి గాడ్ ఫాథర్ లా ఉంటున్న ఆ వ్యక్తి మరెవరో కాదు. నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్. ఈ సీనియర్ టెక్నీషియన్ ప్రస్తుతం నిర్మాతగా బాగానే సక్సెస్ అవుతున్నాడు. బాహుబలి సినిమా హిందీలో సక్సెస్ కావడానికి ఆయన పాత్ర చాలానే ఉంది. అలాగే కొత్తగా ఎంట్రీ ఇచ్చే వారిని కరణ్ చేతిలో పెడితే సక్సెస్ అవుతారనే టాక్ కూడా ఉంది.

చిన్న సినిమాల్లోనే..
అందుకే శ్రీదేవి జాన్వీ కపూర్ ని కరణ్ జోహార్ చేతికి ఇచ్చింది. అయితే కరణ్ ఆమె కెరీర్ కి ఇంకా సరైన బూస్ట్ ఇవ్వడం లేదు. మొదట సైరత్ సినిమా డిజాస్టర్ కాగా ఇప్పుడు మరో సినిమా థియేటర్స్ లోకి కూడా రావడం లేదు. గుంజన్ సక్సేనా మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ కూడా ఈ బ్యూటీ చిన్న సినిమాల్లోనే నటించనుంది.
Recommended Video

గుడ్డిగా నమ్మి..
జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తోంది అనగానే బాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ నుంచి కూడా పెద్ద హీరోల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ కరణ్ జోహార్ ఇప్పుడే రిస్క్ చేయవద్దని ఆమెకి సలహాలు ఇచ్చాడట. అందుకే అతన్ని జాన్వీ గుడ్డిగా నమ్మి మంచి మంచి అవకాశాలను మిస్ చేసుకుంటోంది అనే కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా జాన్వీ కెరీర్ పై ఈ మ్యాటర్ కొంత ఎఫెక్ట్ చూపించేలా ఉందని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











