Just In
- 9 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 3 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తుపాకీతో బెదిరించడం లేదు కదా.. కంగనాకు కరణ్ జోహార్ కౌంటర్.. వీడియో వైరల్!
కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్ సినీ ప్రముఖులతో ఒక యుద్ధమే చేస్తోంది. గతంలో చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ పెద్దగా డోస్ పెంచలేదు. కానీ ప్రస్తుతం కంగనా డోస్ పెంచేసింది. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా సీరియస్ గా స్పందిస్తూ.. కరణ్ జోహార్ వంటి వారికి చెమటలు పట్టిస్తోంది. ఆమె ఎన్ని విమర్శలు చేస్తున్నా కూడా కరణ్ జోహార్ మాత్రం స్పందించడం లేదు. ఇక గతంలో కంగానపై కరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాక్షసుల్లా ప్రవర్తించారు..
సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి కంగనా ఎక్కువగా కరణ్ జోహార్ ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అలియా భట్, మహేష్ భట్ వంటి వారిపై కూడా ఊహించని విధంగా కామెంట్ చేస్తోంది. ఒకానొక సమయంలో అవకాశాలు లేకుండా చేసి రాక్షసుల్లా ప్రవర్తించారని చెప్పిన కంగనా ఎవ్వరిని వదిలిపెట్టను అని వార్నింగ్ లు ఇస్తోంది.
|
వీడియో వైరల్..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. గతంలో కరణ్ జోహార్ కంగనాపై ఒకసారి ఊహించని విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మానసిక పరిస్థితి బాగా లేదంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే రకమని డైరెక్ట్ ఇంటర్వ్యూలలోనే కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా 2017లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంతర్జాతీయ సమావేశం సందర్భంలో కరణ్ జోహర్.. కంగనను తీవ్రంగా విమర్శించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

తుపాకీతో బెదిరించడం లేదు కదా..
ఆ వీడియోలో కరణ్ ఏమన్నారంటే.. ఆమె ప్రతిసారి మహిళను అనే పాయింట్ తోనే సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను బాధితురాలిననే అంటూ ఇండస్ట్రీలోని వారు ఆమెను బెదిరించిన విషాదకర స్టోరీల గురించి చెబుతుంది. మిమ్మల్ని తుపాకితో బెదిరించి నటించమని అనడం లేదు కదా..

ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి
ఇష్టం లేకపోతే ఇండస్ట్రీని వదిలి వెళ్ళండి. వేరే పని చేసుకోండి. అంతేగాని ప్రతిసారి అవతలి మనిషి ఈగోను రెచ్చ గొడితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని కరణ్ ఆ వీడియోలో స్వీట్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇంటర్నెట్ లో ఆ వీడియో ఇప్పుటి వివాదాల కారణంగా మళ్ళీ వైరల్ అవుతోంది. ఇక కరణ్ జోహార్ పై మళ్ళీ ఎప్పటిలానే నెటిజన్స్ ట్రోలింగ్ తో నిద్ర లేకుండా చేస్తున్నారు.