సుశాంత్ మృతి తర్వాత కరణ్ జోహర్ మరో ఇన్స్‌టా పోస్టు.. సూసైడ్ గ్యాంగ్ ఆరోపణల మధ్య..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖులు కొందరు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుశాంత్ మృతికి పరోక్షంగా కారణం ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు కరణ్ జోహర్ అంటూ కొన్ని వర్గాలు వేలెత్తి చూపాయి. దాంతో ఆయన మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సుశాంత్ మరణం రోజున స్పందించిన తర్వాత మళ్లీ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సంఘటన కనిపించలేదు. దాదాపు రెండు నెలల తర్వాత ఆయన తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput: Karan Johar, Salman Khan ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి!!
 సుశాంత్ డ్రైవ్ మూవీని ఓటీటీ రిలీజ్

సుశాంత్ డ్రైవ్ మూవీని ఓటీటీ రిలీజ్

సుశాంత్‌తో కరణ్ జోహర్ చేతులు కలిపి డ్రైవ్ అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని భావించిన కరణ్ జోహర్ థియేటర్లలో రిలీజ్ చేయకూడదని ప్లాన్ చేశారు. అయితే థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఆ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. దాంతో సుశాంత్ సింగ్ రాజ్ మనస్తాపానికి గురయ్యారని, దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లారనే వార్తలు వచ్చాయి. డ్రైవ్ సినిమాను ఉద్దేశపూర్వకంగానే రిలీజ్ చేయకుండా సుశాంత్‌ కెరీర్‌‌ను తొక్కేయాలనే కారణంతోనే థియేటర్‌లో రిలీజ్ చేయలేదనే వాదనలు సోషల్ మీడియాలో వినిపించాయి.

 నన్ను నేనే నిందించుకోవాలని కరణ్

నన్ను నేనే నిందించుకోవాలని కరణ్

ఇక జూన్ 14వ తేదీన సుశాంత్ మరణం వార్త బయటకు వచ్చిన తర్వాత కరణ్ జోహర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. డ్రైవ్ సినిమా తర్వాత సుశాంత్‌తో టచ్‌లో లేను. గతేడాది నుంచి సుశాంత్‌తో టచ్‌లో లేకపోవడానికి నన్ను నేను నిందించుకోవాలి. నీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరముందని భావించినప్పటికీ ఎందుకో కుదర్లేదు. అలాంటి తప్పు మరోసారి చేయను, సుశాంత్ మరణం నాకో కనువిప్పు. స్వచ్ఛమైన చిరునవ్వు.. ప్రేమతో కూడిన కౌగిలి ఎప్పటికీ మరిచిపోలేను అంటూ కరణ్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

 సుశాంత్ మరణంతో బాలీవుడ్ మాఫియా అంటూ

సుశాంత్ మరణంతో బాలీవుడ్ మాఫియా అంటూ

సుశాంత్ సింగ్ మరణం తర్వాత కరణ్ జోహార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనపై ఆరోపణలు రావడంతో లక్షలాది మంది తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫాలోవర్స్ అన్ ఫాలో అయ్యారు. ఆయనను పోలీసులు విచారించాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్‌లో మూవీ మాఫియాకు గ్యాంగ్ లీడర్ అంటూ ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టారు.

 కంగన రనౌత్ నిప్పులు

కంగన రనౌత్ నిప్పులు

ఇక కరణ్ జోహర్‌, మహేష్ భట్, ఆదిత్య చోప్రా లాంటి వారిపై కంగన అపరకాళీలా లేచారు. బాలీవుడ్‌లో కొందరిని ఉద్దేశించి సూసైడ్ గ్యాంగ్ అంటూ నిప్పులుచెరిగారు. కంగన రనౌత్ ఆరోపణల తర్వాత సంజయ్ లీలా భన్సాలీ, మహేష్ భట్‌ను ముంబై పోలీసులు విచారించారు. అయితే కరణ్ జొహార్‌ను మాత్రం పోలీసులు విచారించడకపోవడం గమనార్హం.

తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ రోజున

తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ రోజున

సుశాంత్ మరణం తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా నుంచి అదృశ్యమయ్యారు. ఇప్పుడిప్పుడే వారు ఏదో సందర్భం చూసుకొని స్పందించడం మొదలుపెట్టారు. తాజాగా కరణ్ జోహర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. మన దేశం గొప్పది. సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రకు ప్రతీక. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్ అంటూ పోస్టులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X