గుర్తుపట్టలేని విధంగా అతిలోక సుందరి శ్రీదేవి ఫ్రెండ్ .. ఎముకల గూడులా
గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ రంగంలో ఉన్న వారికి అందమే పెట్టుబడి. ఎంత కాలం వారి శరీరం ఫిట్‌గా ఉండి, అందం ఉంటుందో అప్పటి వరకు వారి కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. అందంలో , శరీరంలో ఏమాత్రం మార్పులు వచ్చినా డౌన్‌ఫాల్ ప్రారంభం కావడం తథ్యం. బొద్దుగా మారి ఇండస్ట్రీకి దూరమైన నటీనటులు ఎందరో. అందం కాపాడుకోవడం కోసం కాస్మోటిక్స్ సర్జరీలు చేయించుకుని ప్రాణాల పొగొట్టుకున్న వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బక్కచిక్కి కనిపించడంతో సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి.
ఉన్నపళంగా బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. శరీరతత్వాన్ని అర్ధం చేసుకోకుండా రాత్రికి రాత్రి బరువు తగ్గాలనే చేసే పిచ్చి ప్రయత్నాలు ప్రాణాల్ని తీసేస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో నటీనటులు జిమ్ అని, వర్కవుట్స్ అని, యోగా అని బాడీని కష్టపెడుతుంటారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ నటీనటులు పంచుకునే వీడియోలు, ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ అతి ఎక్కడా పనికిరాదు అన్నట్లు .. ఈ మితీమిరిన పోకడ జీవితాలనే నాశనం చేస్తోంది.

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కొద్దిరోజుల క్రితం బక్కచిక్కి కనిపించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బాలీవుడ్ బడా నిర్మాత యష్ జోహార్ కుమారుడే కరణ్ జోహార్. 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు కరణ్. న్యూమరాలజీని విపరీతంగా ఫాలో అయ్యే ఆయన తన సినిమాల మొదటి అక్షరం కేతో ప్రారంభమయ్యేలా చూసుకుంటారు. అందుకు అనుగుణంగానే కబీ ఖుషి కబీ గమ్, కల్ హో నా హో, కాల్, కబీ అల్విద నా కెహ్నా అంటూ పేర్లు పెట్టారు. అయితే తర్వాత తన సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి వేరే అక్షరాలతోనూ తన సినిమా పేర్లు పెట్టారు.
50 ఏళ్లు దాటినా ఇంకా ఈయన పెళ్లి చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయారు. కరణ్ జోహార్ ఆస్తుల విలువ రూ.1400 కోట్ల పైమాటేనని బీటౌన్ వర్గాల మాటల. బాలీవుడ్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరరు. 2024లో అతను తన ప్రొడక్షన్ స్టూడియోలోని 50 శాతం వాటాను ప్రముఖ పారిశ్రామిక వేత్త అదర్ పూనావాలాకు దాదాపు రూ.1000 కోట్లకు విక్రయించి హిందీ చిత్ర పరిశ్రమకు షాకిచ్చాడు. తెలుగు సినిమా బాలీవుడ్‌పై దండయాత్ర చేయడానికి కారణం కరణ్ జోహారే. ఆయన సహాకారం లేకపోతే నేడు మన టాలీవుడ్‌కి పాన్ ఇండియా మార్కెట్ లభించేది కాదని విశ్లేషకులు అంటారు. ధర్మా ప్రొడక్షన్స్ పేరుతో తెలుగు సినిమాలను హిందీలో కరణ్ జోహార్ పంపిణీ చేస్తున్నారు.
బాలీవుడ్‌లోని స్టార్స్ అందరితోనూ కరణ్ జోహార్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా దివంగత సినీనటి, అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబానికి ఆయన ఎంత చెబితే అంత. జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి కారణం జోహారే. కరణ్ సూచన మేరకే ఎన్టీఆర్ సరసన దేవరలో నటించడానికి జాన్వీ అంగీకరించారట. ఏజ్ పెరుగుతున్నా స్టైలీష్‌గా, హ్యాండ్సమ్ లుక్‌లో కనిపిస్తుంటారు కరణ్ జోహార్. అయితే ఇటీవలి ఆయన లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఏదో వ్యాధి సోకినవాడిలో సన్నగా, ఎముకల గూడులా మారిపోయాడు కరణ్.
ఆయన బరువు తగ్గడానికి ఓజెంపిక్ అనే ఇంజెక్షన్‌ను ఉపయోగిస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియా కథనాలను నివేదించింది. వీటిపై కరణ్ జోహార్ స్పందించారు. ఆహారపు అలవాట్లు, డైట్ వల్లే తాను బరువు తగ్గానని.. ఎలాంటి మందులు ఉపయోగించలేదని ఆయన తెలిపారు. రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయడంతో పాటు ప్రణాళిక ప్రకారం డైట్ ఫాలో అవ్వడమే దీనికి కారణమని కరణ్ జోహార్ స్పష్టం చేశారు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆస్క్ కేజో సెషన్‌ను నిర్వహించగా నెటిజన్లు అతని బరువు గురించి ప్రశ్నించారు. తాను ఇలా మారడానికి ఎంతో సమయం పట్టిందని, ఎంతో కష్టపడ్డానని.. కానీ ఎలాంటి మందులు తీసుకోలేదని కరణ్ జోహార్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











