దారుణంగా కరణ్ పరిస్థితి.. ఆయన కవల పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులు. భోరున ఏడుస్తూ..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌తోపాటు చాలా మంది ప్రముఖులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబాల పిల్లలకే ప్రోత్సాహం ఉంటుంది. బయట నుంచి వచ్చే యువ ప్రతిభావంతులను అణిచివేస్తారనే విమర్శలు వెల్లువెత్తాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి పరోక్ష కారణం బాలీవుడ్ సినీ ప్రముఖులే అంటూ సోషల్ మీడియాలో దాడి చేయడం చర్చనీయాంశమైంది. అయితే సుశాంత్ మరణం తర్వాత కరణ్ జోహర్ పరిస్థితి ఏలా మారిందనే విషయాన్ని ఆయన స్నేహితుడు మీడియాకు వివరిస్తూ.. .

Recommended Video

England vs West Indies 1st Test 2020 : Funny Memes and Jokes Go Viral After Fans Upset
డ్రైవ్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో

డ్రైవ్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో దర్శకుడు కరణ్ జోహర్ డ్రైవ్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా సినిమాను 2019లో జూన్‌లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. అలా ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయడం విమర్శలకు తావివచ్చింది. ఉద్దేశపూర్వకంగానే సుశాంత్ కెరీర్‌ను దెబ్బ తీయడానికి ఇలా కుట్ర పన్నారనే విమర్శలు వచ్చాయి.

సుశాంత్ మరణం తర్వాత

సుశాంత్ మరణం తర్వాత

ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్‌ను కుదిపేసింది. సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్‌కు చెందిన కొన్ని ఫ్యామిలీలే అంటూ కంగన రనౌత్, శేఖర్ సుమన్ తదితర ప్రముఖులు ఆరోపణలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియాలో కరణ్ జోహర్, ఆలియాభట్, సోనమ్ కపూర్ లాంటి వారిని ట్రోల్ చేశారు.

తీవ్ర మనస్తాపానికి గురై

తీవ్ర మనస్తాపానికి గురై

సుశాంత్ మరణం తర్వాత జరిగిన ట్రోల్స్ దాడితో కరణ్ జోహర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రతీ రోజు భోరుమని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సంబంధం లేని విషయాలను తనకు అంటగడుతూ ఆరోపణలు చేయడంతో ఓ రకమైన దిగ్బ్రాంతికి గురయ్యాడు. అలాగే సుశాంత్ మరణంతో చాలా కుంగిపోయారు అని కరణ్ స్నేహితుడు చెప్పారు.

ఎవరితో మాట్లాడే పరిస్థితుల్లో లేరు

ఎవరితో మాట్లాడే పరిస్థితుల్లో లేరు

సుశాంత్ మరణం తర్వాత చోటుచేసుకొన్న పరిస్థితుల తర్వాత కరణ్ పరిస్తితి చాలా దిగజారింది. ప్రస్తుతం ఆయన ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలొ లేడు. తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆయన మానసిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్తితుల్లో కరణ్‌తో మాట్లాడటం కూడా చాలా కష్టమే. ఎవరైనా ఇలా కదిలిస్తే గంటల తరబడి ఏడుస్తున్నాడు. నాలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు తగునా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని కరణ్ స్నేహితుడు మీడియాతో ఆయన పరిస్థితిని పంచుకొన్నారు.

కవల పిల్లలను చంపేస్తామని

కవల పిల్లలను చంపేస్తామని

సుశాంత్ మరణం తర్వాత కరణ్‌కు బెదిరింపులకు కూడా వస్తున్నాయి. వ్యక్తిగత దాడులకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఆయన కవల పిల్లలను కూడా చంపేస్తామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరణ్ జోహర్ పరిస్థితి దయనీయంగా మారింది అని కరణ్ సన్నిహితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X