twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ బ్యాడ్ టైంకి కారణమదే.. కరణ్ జోహార్ ఓపెన్ కామెంట్స్!

    |

    ప్రస్తుతం మిగతా పరిశ్రమలతో పోలిస్తే కనుక బాలీవుడ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ మధ్య విడుదలైన పృథ్వీరాజ్, జెర్సీ లాంటి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటే అవి అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఈ ఏడాది విడుదలైన కన్నడ బేస్ ఉన్న కేజిఎఫ్ 2, తెలుగు బేస్ ఉన్న ఆర్ఆర్ఆర్ గత ఏడాది విడుదలైన పుష్ప లాంటి సౌత్ సినిమాలు మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టించాయి. తాజాగా ఈ విషయం మీద బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ స్పందించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 చాలా మంచి చిత్రం అని ఆయన కామెంట్ చేశాడు. అయితే అది బాలీవుడ్‌లో కనుక నిర్మించబడి ఉంటే, విమర్శకులు, రివ్యూయర్లు ఈ సినిమాను తక్కవ చేసి ఉన్నకంటెంట్‌ను తప్పుపట్టేవారని అన్నారు.

    నిజానికి బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న 'జుగ్‌ జుగ్‌ జియో', 'బ్రహ్మాస్త్ర'తో పాటు మన పూరీ నిర్మాణ భాగస్వామ్యంతో 'లైగర్‌'కూ ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా సినిమాల ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నకరణ్‌ ఓ ఇంగ్లీష్ టాబ్లాయిడ్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోనే ఆయన బాలీవుడ్‌ నుంచి వస్తోన్న కంటెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ నుంచి ఈ మధ్యకాలంలో సరైన కంటెంట్‌ రాలేదని ఆయన ఒప్పుకున్నారు. అలా ఒప్పుకుంటూనే ఒకవేళ నిజంగా వచ్చి ఉన్నా రివ్యూయర్లు దాన్ని చీల్చి చెండాడే వారని అన్నారు. సినిమా కోసం కథలను ఎంచుకోవడం, తెరకెక్కించే విషయంలో దక్షిణాది చిత్ర దర్శకులకు ఉన్న నమ్మకం కానీ క్లారిటీ కానీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో లోపించినట్లు అనిపిస్తోందని అన్నారు.

    karan johar interesting comments on bollywood failure

    ఒకే సినిమాలో ఎన్నో అంశాలను చూపించాలనుకుని.. కొన్నిసార్లు బాలీవుడ్ నుంచి మేము విఫలమవుతుంటాము కానీ, దక్షిణాది దర్శకులు.. ఏం చెప్పాలనుకుంటే దాన్ని సరిగ్గా, ప్రేక్షకుడికి చేరువయ్యేలా సినిమాలు రూపొందిస్తున్నారని కొనియాడారు. ఇక కరణ్ చేసిన కామెంట్స్ బాలీవుడ్ బ్యాడ్ టైమ్‌కి ప్రధాన కారణాన్ని అర్ధమయ్యేలా చెప్పేశాయి. ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో థియేటర్‌లకు రప్పించేలా చేయడానికి అవసరమైన కేజీఎఫ్ 2 వంటి సినిమాలు చేయడం ముఖ్యం అని అర్థం అవుతోంది. సౌత్ మేకర్స్ విమర్శకులను పట్టించుకోని విధంగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించడంలో ప్రావీణ్యం సంపాదించారు. అందుకే దక్షిణాది దర్శకులు పాన్-ఇండియన్ సినిమాలు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిసినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ కూడా ఈ విషయం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్న మాట.

    English summary
    karan johar interesting comments on bollywood failure in a recent interview with a english tabloid.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X