నా తొలి సెక్స్ అనుభవం ఓ చేదు ఘటన.. డబ్బులిచ్చి శృంగారం.. కరీనాను పెళ్లి.. కరణ్

By Rajababu

Recommended Video

తన మొదటి శృంగారం గురించి కరణ్ జోహర్‌ వ్యాఖ్యలు

బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌ది జీవితం ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. 45 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉంటూ సర్రోగసి ద్వారా కలిగిన ఇద్దరు పిల్లకు తండ్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ అప్పడప్పుడు ఆయన శృంగారం గురించి పబ్లిక్‌గా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహర్ తన మొదటి సెక్స్ అనుభవం గురించి వివరించాడు. ఆయన ఏమన్నారంటే..

సెక్స్ గురించి ఆలోచించను

సెక్స్ గురించి ఆలోచించను

నేను సెక్స్ గురించి పెద్దగా ఆలోచించను. దాని కోసం ఎక్కువగా ఖర్చుపెట్టను. డేటింగ్ చేయడం కూడా నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. అప్పుడప్పుడు సన్నిహిత సంబంధాలు కొనసాగించాల్సి వస్తుంది. అయితే యధాలాపంగా సెక్స్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అని కరణ్ అన్నారు.

సెక్స్‌లో ఆనందం పొందాలంటే

సెక్స్‌లో ఆనందం పొందాలంటే

ఒకవేళ ఎవరితోనైన శారీరక ఆనందాన్ని కోరుకొంటే, వారితో నేను చనువుగా ఉంటాను. వారితో స్నేహపూర్వకమైన సంబంధం ఉండాలి. ఇష్టాయిష్టాలను ఒకరికొకరం మాటల ద్వారా పంచుకోవాలి. అప్పుడే వారితో సెక్స్‌లో ఆనందాన్ని పొందుతాను. అలా ఉంటేనే సెక్స్ సౌకర్యం, ఆనందం దొరుకొంతుంది అని కరణ్ పేర్కొన్నారు.

26 ఏళ్ల వయసులో మొదటిసారి

26 ఏళ్ల వయసులో మొదటిసారి

నా తొలి సెక్స్ అనుభవం ఎంత గొప్పగా జరుగలేదు. 26 ఏళ్ల వయసులో లైంగికంగా ఒకరిని కలిశాను. సెక్స్‌లో అనుభవం లేకపోవడంతో అంత సంతృప్తికరంగా జరుగలేదు. అప్పుడు నేను సెక్స్ కోసం డబ్బులు చెల్లించాను. ఆ తర్వాత వారం రోజులు ఆగి రెండోసారి ట్రై చేశాను అని కరణ్ చెప్పాడు.

శృంగారంలో చేదు అనుభవం

శృంగారంలో చేదు అనుభవం

రెండోసారి కూడా శృంగారంలో చేదు అనుభవం ఎదురైంది. చాలా ఇబ్బందికి లోనయ్యాను. సెక్స్‌లో అంతగా ఆనందం లభించలేదు. అదో చెత్తపని అనే ఫీలింగ్ కలిగింది. డబ్బులు ఇచ్చి సుఖాన్ని కొనుక్కోవడమంతా బుద్ది తక్కువ పని ఏది లేదనిపించింది. డబ్బులు తీసుకొనే వారు కృత్రిమమైన ప్రేమను కురిపిస్తారని ఫీలింగ్ ఏర్పడింది అని కరణ్ తన అనుభవాలను వెల్లడించారు.

కరీనాను పెళ్లి చేసుకోవాలని

కరీనాను పెళ్లి చేసుకోవాలని

పెళ్లి చేసుకోవాలనిపిస్తే కరీనా కపూర్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొంటాను. ఎందుకంటే ఆమె గొప్ప అందగత్తె. ఫన్నీగా, సరదాగా ఉంటుంది. అలాంటి భాగస్వామి ఉంటే చాలనుకొంటాను అని అన్నారు.

భారీ బడ్జెట్‌తో తఖ్త్ సినిమా

భారీ బడ్జెట్‌తో తఖ్త్ సినిమా

ఇక సినిమాల విషయానికి వస్తే., కరణ్ జోహర్ ఓ భారీ బడ్జెట్ చిత్రానికి రంగం సిద్ధం చేశారు. కరీనా కపూర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్, జాన్వీ కపూర్, భూమి పండేకర్, వికీ విశాల్, అనిల్ కపూర్ లాంటి భారీ తారాగణం, బడ్జెట్‌తో తఖ్త్ అనే సినిమాను రూపొందిచనున్నారు. ఈ చిత్రం 2020లో విడుదల కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X