twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో, హీరోయిన్ల పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్.. వారిపై కేసు పెట్టండి.. ఎమ్మెల్యే డిమాండ్

    |

    బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఇటీవల ఏర్పాటు చేసిన విందులో రణ్‌బీర్ కపూర్, దీపిక పదుకోన్, వికీ కౌశల్ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహర్ షేర్ చేసిన ఆ పార్టీకి సంబంధించిన వీడియో వివాదంలో కూరుకుపోయింది. సినీ తారలు డగ్స్ పుచ్చుకొని ఊగిపొయారంటూ ఆ వీడియోపై శిరోమణి అకాళీదల్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఘాటుగా ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. అయితే అలాంటిదేమీ లేదని ఖండించారు. ఈ వివాదంపై తాజాగా మంజిందర్ సింగ్ మరోసారి సంచలన ఆరోపణలతో కూడిన లేఖను సంధించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

    డ్రగ్స్ వాడకపోతే ఫుడ్, డ్రింక్స్ ఏవీ..

    డ్రగ్స్ వాడకపోతే ఫుడ్, డ్రింక్స్ ఏవీ..

    ఎమ్మెల్యే సిర్సా స్పందిస్తూ.. కరణ్ జోహర్ ఇచ్చిన పార్టీలో ముమ్మాటికి డ్రగ్స్ విచ్చలవిడిగా వాడారు. అయితే మాములూ పార్టీ అయితే ఆ వీడియోలో ఆహారం, డ్రింక్స్ ఉండవా? పక్కనే టేబుల్‌పై ఉన్న డ్రగ్స్ పౌడర్ కాకపోతే.. మరేంటి? డ్రగ్స్ వినియోగించకపోతే వారు అలా మత్తులో ఎలా ఉంటారు అని సిర్సా ప్రశ్నించారు.

    సినీ తారలకు నైతిక విలువలు ఉండవా?

    సినీ తారలకు నైతిక విలువలు ఉండవా?

    సినిమా తారలకు చెడు పనులకు పాల్పడితే వారికి నైతికలు ఉండవా? ఒకవేళ హార్ధిక్ పాండ్యా లైంగికపరమైన వ్యాఖ్యలు చేస్తే శిక్ష వేస్తారు? అదే రాజకీయ నేతలు తప్పు చేస్తే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. మరి సినీ తారలకు ఇలాంటి శిక్షలు ఉండవా? అని ఘాటుగా సిర్సా స్పందించారు.

    బాలీవుడ్ తారలపై కేసు పెట్టాలి

    బాలీవుడ్ తారలపై కేసు పెట్టాలి

    కరణ్ జోహర్ విందులో డ్రగ్స్ విచ్చల విడిగా వాడారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అందువలన బాలీవుడ్ తారలపై ముంబై పోలీసులను కేసు దాఖలు చేయాలని రిక్వెస్ట్ చేశాను. వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్, 1985 కింద కేసు నమోదు చేయాలి. కరణ్ జోహర్ అప్‌లోడ్ చేసిన వీడియోను ఆధారంగా తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలి అని సిర్సా డిమాండ్ చేశారు.

     డ్రగ్స్ వాడలేదని.. కాంగ్రెస్ నేత ఖండన

    డ్రగ్స్ వాడలేదని.. కాంగ్రెస్ నేత ఖండన

    ఇదిలా ఉండగా, సిర్సా డ్రగ్స్ ఆరోపణలను కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా ఖండించారు. ఆ పార్టీలో ఎవరూ కూడా డ్రగ్స్ తీసుకోలేదు. అందుకు నా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఆ పార్టీలో నా భార్య కూడా పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగం జరుగలేదనేది స్పష్టమైన సమాచారం ఉంది అని దేవరా కౌంటర్ ఇచ్చారు. అయినా సిర్సా పట్టు వదలకుండా మళ్లీ ఈ వివాదంపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

    English summary
    Karan Johar had shared a video from his party on July 27. Politicians are now arguing whether the celebrities in the video are drugged or not. Karan Johar hosted a bash for his close friends from Bollywood that included Deepika Padukone, Ranbir Kapoor, Vicky Kaushal, Arjun Kapoor, Malaika Arora, Shahid Kapoor, filmmaker Ayan Mukerji among others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X