For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ ఇంట్లో రణ్‌బీర్, వరుణ్ ధావన్ ఫైట్.. బండబూతులతో రచ్చ రచ్చ!

    |

    బాలీవుడ్‌ హీరోలు పార్టీలో గొడవ పడటం సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. గతంలో ఓ పార్టీలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ గొడవ పడి కొట్టుకొనేంత వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే మళ్లీ పునరావృతం అయింది. అయితే ఈ సారి గొడవ పడింది మాత్రం రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్ కావడం వార్తలో ట్విస్టు. వీరి మధ్య గొడవ ఇటీవల కరణ్ జోహర్ ఇచ్చిన పార్టీలో జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

     కరణ్ జోహర్ ఇంట్లో పార్టీ

    కరణ్ జోహర్ ఇంట్లో పార్టీ

    ముంబైలోని తన నివాసంలో ఇటీవల సినీ ప్రముఖులకు కరణ్ జోహార్ విలాసవంతమైన పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి పలువురు సినిమా నటులతోపాటు రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్ కూడా హాజరయ్యారు. అయితే ఒకే రూమ్‌లో ఉన్న వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. మాట మాట పెరిగి చేజేసుకొనేంత వరకు వెళ్లినట్టు సమాచారం.

    వరుణ్, రణ్‌బీర్ కపూర్ వాగ్వాదం

    వరుణ్, రణ్‌బీర్ కపూర్ వాగ్వాదం

    ఓ దశలో రణ్‌బీర్ ఆవేశంతో వరుణ్ మీదకు దూకాడట. అంతేకాకుండా వరుణ్ లాంటి వాళ్లను పార్టీకి పిలువ వద్దని కరణ్ జోహర్‌కు సూచించాడట. అయితే బయటకు మాత్రం వారి మధ్య గొడవ జరగలేదని ఓ వార్త ప్రచారం జరుగుతున్నది.

     వారి మధ్య గొడవ జరుగలేదని

    వారి మధ్య గొడవ జరుగలేదని

    రణ్‌బీర్, వరుణ్ ధావన్ కరణ్ జోహర్ ఇంటిలో కలుసుకోలేదని, వారిద్దరు ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన పార్టీలో మాత్రమే కలుసుకొన్నారని ఓ బాలీవుడ్ పత్రిక కథనంలో పేర్కొన్నది. అయితే గొడవకు సంబంధించిన నిజా నిజాలు బయటకు రావాల్సి ఉంది.

    వరుణ్ ధావన్ సినిమా కెరీర్

    వరుణ్ ధావన్ సినిమా కెరీర్

    ఇక కెరీర్ పరంగా వరుణ్ ధావన్ జోష్ మీద ఉన్నాడు. కరణ్ జోహర్ రూపొందిస్తున్న కాలాంఖ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాధురి దీక్షిత్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, అలియా భట్, కునాల్ ఖేము, ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్ నటిస్తున్నారు.

    బ్రహ్మస్త్రలో రణ్‌బీర్ కపూర్

    బ్రహ్మస్త్రలో రణ్‌బీర్ కపూర్

    ఇక రణ్‌బీర్ కపూర్ దర్శకుడు ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలియాభట్ కథానాయిక. అమితాబ్, నాగార్జున, డింపుల్ కాపాడియా తదితరులు కూడా నటిస్తున్నారు.

    English summary
    Ranbir Kapoor and Varun Dhawan got into an ugly spat when they two met recently met at Karan Johar's house party in Mumbai. Report suggest that, Ranbir and Varun refused to be in the same room after sharing a heated argument and vile words.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X