ఈ ఫోటోయే సాక్ష్యం.... అతడు, అతడితో ప్రేమలో? టాప్ డైకెక్టర్ రిలేషన్‌షిప్ హాట్ టాపిక్!

బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మే 25న పుట్టినరోజు జరుపుకున్నారు. శనివారంతో ఆయన 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అలియా భట్, కత్రినా కైఫ్, అర్జున్ కపూర్, సోనమ్ కపూర్ తదితరులు విష్ చేస్తూ సందేశాలు పంపారు.

అయితే అమెరికన్-నేపాలీ ఫ్యాషన్ డిజైనర్ ప్రభల్ గౌరంగ్... కరణ్ జోహార్‌ను విష్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. ఇందులో కరణ్, ప్రభల్ ఒకరినొకరు పెనవేసుకుని కనిపించారు. ఈ ఫోటోకు అతడు 'ప్యార్ కియాతో డర్నా క్యా.. హ్యాపీ బర్త్ డే కరణ్ జోహార్' అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఈ ఫోటో చూసిన చాలా మందిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ప్రభల్ గౌరంగ్... కరణ్ జోహార్ అంటే ప్రేమ పెంచుకున్నారని, అతడితో రిలేషన్ షిప్ కోరుకుంటున్నాడని, ఇద్దరూ బహుషా ఇప్పటికే డేటింగులో ఉండి ఉంటారనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.

Karan Johar quashed rumours about relationship with Prabal Gurung

తమ మధ్య రిలేషన్ ఉన్నట్లు వాస్తున్న వార్తలతో కరణ్ జోహార్ అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. వెంటనే 'కంట్రోల్ యువర్ సెల్ఫ్ భయ్యా' అంటూ రిప్లై ఇచ్చారు. ఈ కామెంట్ ద్వారా కరణ్ జోహార్ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు.

ఆత్మకథలో కరణ్ జోహార్ తాను స్వలింగ సంపర్కుడిని అనే విషయం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాను ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నాను అనే విషయం మాత్రం ఆయన ఇప్పటి వరకు బయట పెట్టలేదు. సరోగసీ విధానం ద్వారా ఇద్దరు బిడ్డలకు తండ్రి అయిన కరణ్ వారికి యష్, రోహి అనే పేర్లు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X