నయనతారను నేను అలా అనలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు: కరణ్ జోహార్

బాలీవుడ్ లో కరణ్ జోహార్ కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా నటుడుగా అలాగే హోస్ట్ గా కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే కొన్నిసార్లు అతను ఊహించిన విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాడు. రీసెంట్ గా సమంత అక్షయ్ కుమార్ తో కలిసి నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షో లో అతను చేసిన ఒక కామెంట్ నయనతార అభిమానులను ఎంతగానో కోపానికి గురి చేసింది. అయితే ఈ క్రమంలో కరణ్ జోహార్ తను చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాఫీ విత్ కరణ్ షో

కాఫీ విత్ కరణ్ షో

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమయ్యే కాఫీ విత్ కరణ్ షో ద్వారా కరణ్ జోహార్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో ప్రముఖ సెలబ్రిటీలతో అతను చేసిన ఎపిసోడ్స్ కు హై రేంజ్ లోనే క్రేజ్ లభించింది. ముఖ్యంగా సమంత అక్షయ్ కుమార్ కలిసి చేసిన ఎపిసోడ్ కూడా భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకున్నట్లు సమాచారం.

నెంబర్ వన్ హీరోయిన్

నెంబర్ వన్ హీరోయిన్

అయితే ఆ ఎపిసోడ్లో సమంత పై పొగడ్తలు కురిపించిన కరణ్ జోహార్ ఒక విధంగా నయనతార అభిమానులను తీవ్రంగా కోపానికి గురి చేసినట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే గట్టిగానే వచ్చింది. అది ఏమిటంటే కరణ్ జోహార్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ నువ్వే కదా అనే సమంత గురించి చెప్పాడు. అయితే సమంత మాత్రం నయనతార అని చెప్పగా.. ఆ సమాధానం నా లిస్టులో లేదు.. అని ఊహించని విధంగా ప్రతిస్పందించాడు.

నయనతార ఫ్యాన్స్ ఫైర్

నయనతార ఫ్యాన్స్ ఫైర్

ఒక విధంగా తమిళ ప్రేక్షకులు నయనతారను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. అందుకే ఆమె వచ్చి 15 ఏళ్ళు దాటినా కూడా అదే తరహా లో అభిమానిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా నిత్యం ఆమెకు సంబంధించిన ఏదో ఒక టాపిక్ అయితే వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కరణ్ జోహార్ ఒక విధంగా ప్రతిస్పందించడంతో అతనిపై నయనతార అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు.

కరణ్ జోహార్ క్లారిటీ

కరణ్ జోహార్ క్లారిటీ

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఆ చేసిన వ్యాఖ్యలపై ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు నయనతారను నేను ఆ విధంగా కించపరచాలని అనుకోలేదు అని.. కాకపోతే అభిమానులు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు. నేను ఓరామ్యక్స్ జాబితా ప్రకారం ఆ విధంగా చెప్పాను అని కరణ్ తెలియజేసాడు. ఈ విషయంలో ముమ్మాటికి నయనతారను నేను తక్కువ చేసి మాట్లాడలేదు అని అతను వివరణ ఇచ్చినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం అతన్ని తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.

ఇదేమి కొత్త కాదు..

ఇదేమి కొత్త కాదు..

కరణ్ జోహార్ ట్రోలింగ్ గురికావడం ఇదేమి కొత్త కాదు. అతను కాఫీ విత్ కరణ్ షోలో వేస్తున్న ప్రశ్నలకు ప్రతిసారి కూడా ఎవరో ఒక స్టార్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని షోను నడిపించలేవా? ఎందుకు ఇలా బూతులతో అలాగే ఇతరులను కించపరిచేలాగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నావు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. ఇక రాబోయే కొన్ని షోలతో అయితే కరణ్ మరింత బోల్డ్ సందేహాలతో న్యూ ఎపిసోడ్స్ రెడీ చేస్తున్నారు. మరి ఆ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X