3 రోజుల్లో 2 సార్లు పెళ్లి చేసుకున్న అలియా భట్.. అసలు మ్యాటర్ చెప్పిన డైరెక్టర్

తెలుగు ప్రేక్షకుల్లోనూ చెరగని ముద్ర వేసుకున్న బాలీవుడ్ భామల్లో అలియా భట్ ఒకరు. దర్శక ధీరుడు రాజమౌళి తరెకెక్కించిన RRR మూవీలో సీతగా తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటిని ఆడియెన్స్ బాగానే ఆదరించారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మహేశ్ భట్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ కేవలం 3 రోజుల్లో రెండు సార్లు పెళ్లి చేసుకుందనే ఆసక్తికర విషయాన్ని డైరెక్టర్ కరణ్ జోహార్ బయట పెట్టాడు.

స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ సినిమాతో హిందీలో తెరంగేట్రం చేసిన బ్యూటిఫుల్ అలియా భట్ 2 స్టేట్స్​, హైవే, డియర్​ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, బద్రీనాథ్ కు దుల్హానియా, గల్లీ బాయ్​, కలంక్​, గంగూ భాయ్ కతియవాడి వంటి తదితర సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

 Alia Bhatt

ఈ సినిమాల్లో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. ఇక తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి RRR​ సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అలియా భట్ కనిపించిన నిడివి తక్కువే అయినా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది.

ఇక అలియా భట్ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లాడింది. రణ్ బీర్ పై ప్రేమను వ్యక్తం చేసిన ఈ సుందరి అతనంటే చిన్నప్పటి నుంచి క్రష్ అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రణ్ బీర్ కపూర్ పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కానీ, అలియా భట్ మాత్రం 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' (Rocky Aur Rani Ki Prem Kahani) సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత కరణ్ జోహార్ మెగా ఫోన్ పట్టుకున్న సినిమా ఇది. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాలో రణ్ వీర్, అలియా భట్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి.

 Alia Bhatt Karan Johar

అయితే 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ'లో అలియా, రణ్ వీర్ కు జరిగే పెళ్లి సీన్ చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సన్నివేశాన్ని రణ్ బీర్ కపూర్, అలియా భట్ కు వివాహం జరిగిన మూడు రోజులకే చిత్రీకరించారట. ఈ సీన్ లో ఉండే మెహందీ కూడా అలియా రియల్ లైఫ్ మ్యారేజికి సంబంధించినదే అని డైరెక్టర్ కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు. ఈ విధంగా అలియా భట్ కు మూడు రోజుల్లోనే రియల్ గా, రీల్ గా రెండుసార్లు పెళ్లి జరిగిందని కరణ్ జోహార్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X