26 ఏళ్ల వయసులోనే వర్జినిటీ అవుట్.. 3 గురు టాప్ హీరోయిన్లతో కరణ్ జోహర్ చిలిపిగా..
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ వ్యక్తిగత జీవితం ఎప్పడూ అందర్నీ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన హావభావాలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఆయన తనపైన తానే జోకులు వేసుకొంటూ సరదాగా ఉంటారు. ఇటీవల కాజోల్, ట్వింకిల్ ఖన్నా నిర్వహిస్తున్న షోకు హాజరైన ఆయన తన వర్జినిటీ గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఈ సంభాషణలో ఏకంగా జాన్వీ కపూర్ అడిగిన ప్రశ్నకు ఆమె నోర్మూయించిన పని చేశాడు. తన వర్జినిటీ గురించి ఆయన ఏం చెప్పారనే వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజోల్,ట్వింకిల్ ఖాన్నా జంటగా టాక్ షోను ఇటీవల ప్రారంభించారు. ఈ షోకు అనూహ్యమైన రేటింగ్, స్పందన వస్తున్నది. ఇప్పటికే ఈ షోలో సల్మాన్, అమీర్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటులు హాజరయ్యారు. ఈ షోలో ఇద్దరు టాప్ సెలబ్రిటీలను బోల్డుగా, డేర్‌గా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఈ గేమ్ షోను రక్తి కట్టిస్తున్నారు. ఈ షోలో తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్, యువ హీరోయిన్ జాన్వీ కపూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిలిపి, బోల్డ్ ప్రశ్నలతో హడలెత్తించారు.

టూ మచ్ గేమ్ షోలో కరణ్ జోహర్‌తో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నీవు ఒక నిజం, ఒక అబద్దం చెప్పాలి. అది నిజమా? అబద్దమా? అని మేము డిసైడ్ చేస్తాం. కాబట్టి.. నీవు ఎవరికి చెప్పని బోల్డ్ విషయం మాకు చెప్పాలి అని జాన్వీ అడిగింది. దాంతో నా బ్రహ్మచర్యం తనకు 26 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పోయింది. అది కూడా నీ ఫ్యామిలీలోని ఓ వ్యక్తితో అంటూ కరణ్ జోహర్ బాంబు పేల్చాడు. దాంతో జాన్వీ కపూర్ షాక్ అయి.. వెంటనే చెవులు మూసేసి.. నోరుమూసుకొన్నది. అయితే పక్కనే ఉన్న ట్వింకిల్ ఖాన్నా.. హుషారుగా బోని కపూర్‌తో కాదుగా అంటూ చిలిపిగా సెటైర్ వేసింది.
అయితే కరణ్ జోహర్ చెప్పిన రెండు విషయాల గురించి మాట్లాడుతూ.. నీవు 26 ఏళ్లలో వర్జినిటీ కోల్పోయిన విషయం నిజమే. జాన్వీ కపూర్ కుటుంబంలోని ఓ వ్యక్తితో శృంగారం జరిపారనేది అబద్దం అంటూ కాజోల్ చెప్పింది. దాంతో కరణ్ స్పందిస్తూ.. మొదటిది కరెక్ట్. రెండో విషయం అబద్దం అంటూ వివరణ ఇచ్చారు.
టూమచ్ షో విషయానికి వస్తే.. ఇటీవల ఆలియా భట్, వరుణ్ ధావన్, చంకీ పాండే, గోవిందా లాంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్నది. ఈ షోను నిఖిల్ మదోక్ నిర్మించారు. ఈ రియాలిటీ షోకు మంచి స్పందన కూడా లభిస్తున్నది.


Click it and Unblock the Notifications











