Karan Johar:ఆమె ఏదో రహస్యం దాస్తుంది.. వాళ్లిద్దరు నా షోకు ఎప్పటికీ రారు

బాలీవుడ్​లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్​ కరణ్​ టాక్​ షో ఒకటి. ఈ షోకు బాలీవుడ్​ దర్శక నిర్మాత కరణ్​ జోహార్​ హోస్ట్​గా వ్యవహరించి సూపర్​ సక్సెస్​ అయిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలను తన షోకు పిలిచి వారిపై ప్రశ్నలు కురిపిస్తాడు. చిక్కు ప్రశ్నలతో రోస్ట్​ చేస్తాడు. అయినా ఈ షోకు వచ్చేందుకు ఎంతో మంది సెలబ్రిటీలు ఉత్సాహం చూపిస్తారు. అలాంటింది తన షోలో ఇద్దరు పాపులర్​ సెలబ్రిటీలు ఎప్పటికీ అడుగు పెట్టరని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు కరణ్​ జోహార్.

కరణ్​ జోహార్​.. ప్రస్తుతం ఇతని గురించి తెలియని వారు ఎవరుండరు. ఎన్నో సూపర్​ హిట్​ సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వాటిని ఆయనే సొంతగా నిర్మించారు. అలాగే కాఫీ విత్​ కరణ్​ అనే టాక్​ షోను ఇంట్రడ్యూస్​ చేసి ఎంతో సక్సెస్​ అయ్యారు.

 అనేక రహస్యాలు..

అనేక రహస్యాలు..

ఇప్పటికే ఈ షో 6 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో సీజన్​ కూడా సూపర్​ హిట్​తో దూసుకుపోతోంది. ఈ సీజన్​లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, సమంత, అక్షయ్​ కుమార్, విజయ్​ దేవరకొండ, అనన్య పాండే, కరీనా కపూర్​ వంటి తదితరులు పార్టిస్​పేట్​ చేసి అనేక సీక్రెట్స్​ను బయటపెట్టారు.

అస్సలు ఒప్పుకోలేదు..

అస్సలు ఒప్పుకోలేదు..

అయితే తాజాగా అందరినీ ఇంటర్వ్యూ చేసే కరణ్ జోహార్​ను ఓ మీడియా ఛానెల్​ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న కరణ్​ జోహార్​ బాలీవుడ్​ ప్రముఖ నటి రేఖ తన షోకు రావడానికి అస్సలు ఒప్పుకోలేదని చెప్పాడు కరణ్​.

ఎన్నోసార్లు అడిగాను..

ఎన్నోసార్లు అడిగాను..


ఈ ఇంటర్వ్యూలో ''నా షోకు రావాలని రేఖ మేడమ్​ను నేను ఎంతో అభ్యర్థించాను. గతంలోనే కాదు, ఈ మధ్య కూడా చాలా అడిగాను. ఆమె ఎలాగైనా నా షోలో పార్టిస్​పేట్​ చేయాలనుకున్నాను. కానీ ఆమె మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోలేదు.

ఏదో రహస్యం దాస్తుంది..

ఏదో రహస్యం దాస్తుంది..


అంటే ఆమె ఏదో పెద్ద రహస్యం దాస్తుందనీ, ఆ విషయం ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు నాకు అనిపించింది. ఆమె ససేమిరా రానని చెప్పాక ఇక ఎప్పుడూ ఆమెను షోకు రమ్మని ఆహ్వానించను.

 అన్ని తెలివితేటలు లేవు..

అన్ని తెలివితేటలు లేవు..


అలాగే నా స్నేహితుడు, గురువు ఆదిత్య చోప్రాను కూడా నా షోకు రమ్మని అడగను. ఎందుకంటే ఆయనపై ప్రశ్నలు కురిపించేటంత తెలివితేటలు నాకు లేవు. కాబట్టి మె బీ వీళ్లిద్దరు నా షోలో ఎప్పటికీ కనిపించకపోవచ్చు'' అని తెలిపాడు ఈ స్టార్​ ప్రొడ్యూసర్​.

2005లో తొలిసారిగా..

2005లో తొలిసారిగా..

ఇదిలా ఉంటే కాఫీ విత్ కరణ్​ షో తొలిసారిగా 2005లో టీవీలో ప్రసారమైంది. ప్రస్తుతం ఈ షో ఏడో సీజన్ మాత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ హాట్​స్టార్​ వేదికగా స్ట్రీమింగ్​ అవుతోంది. ఈ వారం షోకి షాహిద్​ కపూర్, కియారా అద్వానీ అతిథులుగా హాజరు కానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X