కరణ్ జోహర్ పార్టీలో కరోనా కలకలం.. జాన్వీకపూర్, సారా అలీఖాన్ హాజరైన షోపై ముంబై పోలీసుల కేసు
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్టిబ్యూటర్ కరణ్ జోహర్ నిర్వహించిన విందులో కరోనావైరస్ కలకలం రేపుతున్నది. కరణ్ జోహర్ ఇచ్చిన పార్టీకి హాజరైన ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కరీనాకపూర్, అమృతా అరోరా కరోనావైరస్ బారిన పడటంతో హిందీ సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే కరణ్ పార్టీకి హాజరైంది ఎవరు? వారు ఎక్కడ ఉన్నారు? వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఎంత మంది ఉంటున్నారనే విషయాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

కరణ్ జోహర్ డిన్నర్ పార్టీలో
కరణ్ జోహర్ నిర్వహించిన పార్టీకి కరీనా కపూర్ ఖాన్, అమృతా అరోరాతోపాటు డజన్‌కుపైగా సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే కరీనా, అమృతా ఇద్దరు కూడా డబుల్ వ్యాక్సినేషన్ వేసుకొన్నారు. అయితే వారిద్దరిని కరోనావైరస్ వెంటాడింది. అయితే వీరికి సోకింది కేవలం సాధారణ కోవిడేనా? లేదా ఓమిక్రాన్ వైరస్ వెర్సన్ ఏమైనా ఉందా అనే కోణంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

డిజైనర్ సీమా ఖాన్‌కు కరోనా
అయితే బీఎంసీ అధికారులు వెల్లడించిన ప్రకారం.. డిసెంబర్ 8వ తేదీన కరణ్ జోహర్ పలువురు ప్రముఖులకు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి హాజరైన డిజైనర్, నటి సీమా ఖాన్ కూడా కోవిడ్‌కు పాజిటివ్ అని నిర్దారించారు. దీంతో అధికారులు వేగంగా స్పందించారు. ఈ పార్టీకి హాజరైన వారికి సన్నిహితులు, వీరు నివసించే భవనాల్లోని నివాసితులకు కోవిడ్ నిర్ధారణ, రోగ పరీక్షలు నిర్వహిస్తున్నాం అని అధికారుల తెలిపారు.

కరిష్మా, మలైకా, మసాబా హాజరు
అయితే కరణ్ జోహర్ నిర్వహించిన పార్టీకి కరీనా సోదరి కరిష్మా కపూర్, మలైకా అరోరా, డిజైనర్ మసాబా గుప్తా తదితరులు హాజరయ్యారు. వీరితోపాటు మరికొందరు కూడా క్వారంటైన్ జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే కరణ్ జోహన్ నివాసాన్ని అధికారులు పూర్తిగా సానిటైజ్ చేశారు. పార్టీకి హాజరైన వారిని కోవిడ్ పరీక్షలు చేసుకోమని సూచిస్తున్నాం అని బీఎంసీ అధికారులు తెలిపారు.

కరీనా కపూర్‌కు డబుల్ వ్యాక్సినేషన్
ఇదిలా ఉండగా, కరీనా కపూర్ సోషల్ మీడియాలో కోవిడ్ పాజిటివ్ గురయ్యానని స్పష్టం చేశారు. నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. మెడికల్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాను. నాతో కలిసిన వారు వెంటనే టెస్టులు చేయించుకోగలరు. నా ఫ్యామిలీ అంతా డబుల్ వ్యాక్సినేషన్ చేసుకొన్నారు. నా కుటుంబంలో ఎవరికి కూడా ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. నేను ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను అని కరీనా ట్వీట్ చేశారు.

పంజాబ్ ర్యాపర్‌పై ఎఫ్ఐఆర్
ఇదిలా ఉండగా, పంజాబ్‌కు చెందిన ప్రముఖ ర్యాపర్ ఏపీ ధిల్లాన్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలో నిర్వహించిన సంగీత కచేరి నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ షోలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, సారా ఆలీఖాన్, ఆమె సోదరుడు కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











