3 కోట్లు కలెక్షన్లు రాబట్టలేని హీరోలు.. 35 కోట్ల రెమ్యునరేషనా? నిర్మాత సంచలన కామెంట్

ఇండియన్ సినిమా పరిశ్రమ గత రెండేళ్లుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. భారీ బడ్జెట్ సినిమాలు, అగ్రనటుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా పడ్డాయి. దాంతో సినిమాల రిలీజ్, బిజినెస్ జరగకపోవడం, బిజినెస్ జరిగిన సినిమాలు రిలీజై కలెక్షన్లు సాధించకపోవడంతో సినిమా పరిశ్రమ సంక్షోభంలో మునిగిపోయింది. అయితే ఇటీవల బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

కరోనా పరిస్థితుల తర్వాత సినిమా పరిశ్రమపై భారీగా దెబ్బ పడుతున్నది. ఆర్థిక పరమైన నష్టాల నుంచి నిర్మాత కోలుకోవడం కష్టంగా మారింది. దాంతో బడ్జెట్ పెరిగిపోయాయని, అలాగే హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోయాయనే వాదన మొదలైంది. దాంతో నిర్మాతలు, హీరోలకు మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది.

Karan Johar Sensational Comments Heroes Remunerations in Indian Film Industry

ఇక సినిమా పరిశ్రమలో భిన్నాభిప్రాయల నేపథ్యంలో కొన్ని రోజులపాటు షూటింగులు నిలిపివేసి.. సమ్మెలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఎప్పటిలానే హీరోల రెమ్యునరేషన్లు డిమాండ్ మేరకు నిర్మాతలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది.

అయితే ప్రస్తుతం సినిమా షూటింగులకు కూడా బడ్జెట్ పరంగా ఇష్యూస్‌ను ఫేస్ చేస్తున్నది. ఓటీటీ బిజినెస్ కూడా కాకపోవడంతో సినిమాలు తీయడం నిర్మాతకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. అన్ని భాషల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కరణ్ జోహర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఇటీవల కరణ్ జోహర్ మాట్లాడుతూ.. కొందరు హీరోలు అత్యధికంగా బడ్జెట్ డిమాండ్ చేస్తున్నారు. తొలి రోజు కనీసం 3 కోట్లు ఓపెనింగ్ కలెక్షన్లు సాధించలేని హీరోలు 35 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది సినిమా పరిశ్రమలకు ఛాలెంజ్‌గా మారిందని అన్నారు. కరణ్ జోహర్ చేసిన కామెంట్స్ అన్ని భాషల్లోను చర్చనీయాశంమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X