twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హోమో సెక్సువల్‌: కరణ్ జోహార్ ఆలోచన వివాదానికి కారణం కానుందా?

    |

    ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ త్వరలో హోమో సెక్సువల్(స్వలింగ సంపర్కం) నేపథ్యంతో ప్రేమకథా చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్ సిటీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరైన ఆయన తన మనసులోని విషయం బయటపెట్టారు.

    రొమాంటిక్ చిత్రాలు, ప్రేమకథా చిత్రాలు తీసే దర్శకుడిగా కరణ్ జోహార్ ప్రఖ్యాతి చెందారు. గతంలో ఆయన రూపొందించిన సేమ్ సెక్స్ కాన్సెప్టు మూవీ 'దోస్తానా' మంచి విజయం అందుకుంది. ఈ సారి హృదయాలను కదిలించే గే రొమాన్స్ కథను సిద్ధం చేస్తున్నారు ఈ స్టార్ డైరెక్టర్.

    నటించేది ఎవరు?

    నటించేది ఎవరు?

    తను తీయబోయే గే సెక్స్ రొమాంటిక్ చిత్రంలో నటించేది ఎవరు? అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదని, త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్లు కరణ్ జోహార్ తెలిపారు.

    ఆలియాభట్ క్లిప్పింగ్ లీక్.. ఇంటర్నెట్‌లో వైరల్!ఆలియాభట్ క్లిప్పింగ్ లీక్.. ఇంటర్నెట్‌లో వైరల్!

    గతంలో వివాదాలకు కారణమైన సినిమాలు

    గతంలో వివాదాలకు కారణమైన సినిమాలు

    గతంలో ఇండియన్ సినీ పరిశ్రమలో తెరకెక్కిన హోమో సెక్సువల్, లవ్ మూవీస్ పలు వివాదాలకు కారణమయ్యాయి. షబానా అజ్మీ, నందితా దాస్ ప్రధాన పాత్రల్లో దీపా మెహతా రూపొందించిన ‘ఫైర్' మూవీపై అప్పట్లో శివ సేన, భజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఆందోళన చేయడంతో పాటు విడుదల అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

    అన్నీ తెలిసి కూడా...

    అన్నీ తెలిసి కూడా...

    భారతీయ సమాజంలో హోమో సెక్సువాలిటీని అంగీకరించే పరిస్థితి లేదు. అలాంటి కాన్సెప్టులతో సినిమాలు వస్తే నిరసన సెగలూ తప్పవు. అన్నీ తెలిసి కూడా కరణ్ జోహార్ అలాంటి కథతో సిద్ధం అవుతున్నారంటే వివాదాలను ఎదుర్కోవడానికి ఆయన సన్నద్ధం అవుతున్నట్లు స్పష్టమవుతోంది.

    కరణ్ జోహార్

    కరణ్ జోహార్

    2016లో వచ్చిన ‘యే దిల్ హై ముష్కిల్' తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం సినిమాలేవీ రాలేదు. ఈ మధ్యకాలంలో ఆయన నిర్మాణంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. త్వరలోనే స్వలింగ సంపర్క సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పష్టమవుతోంది.

    English summary
    Bollywood film Maker Karan Johar says he wants to make a homosexual love story. He was speaking at the recently concluded World Economic Forum in the Swiss city of Davos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X