తెరపైకి మళ్లీ ‘డ్రగ్స్’కలకలం: నేనేమైనా వెధవనా? ఎమ్మెల్యేకు వార్నింగ్

Recommended Video

Karan Johar Warns Manjinder Singh Sirsa || Filmibeat Telugu

బాలీవుడ్‌ దర్శకుడు కరణ్ జోహర్ ఏర్పాటు చేసిన విందు వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. షాహీద్ కపూర్, మీరా రాజ్‌పుత్, రణ్‌బీర్ సింగ్, మలైకా అరోరా, వరుణ్ ధావన్, నటాషా దలాల్, అర్జున్ కపూర్, వికీ కౌశల్, జోయా ఆక్తర్, ఆయన్ ముఖర్జీ లాంటి సినీతారలు పాల్గొన్న పార్టీలో విచ్చల విడిగా డ్రగ్స్ వినియోగించారంటూ ఎమ్మెల్యే మంజిందర్ ఎస్ సిర్సా ఆరొపణలు చేయడంతో ఈ విందు వివాదంగా మారింది. అయితే ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించలేదంటూ వివరణ ఇచ్చిన ఆరోపణలు మళ్లీ మళ్లీ చేయడంపై దర్శకుడు కరణ్ తీవ్రంగా స్పందించారు. అసలు ఈ వివాదంలోకి వెళితే..

కరణ్ జోహర్ పార్టీలో డ్రగ్స్ అంటూ

కరణ్ జోహర్ పార్టీలో డ్రగ్స్ అంటూ

దర్శకుడు కరణ్ జోహర్ ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వినియోగించారంటూ ఎమ్మెల్యే మంజిందర్ ఎస్ సిర్సా ఆరోపణలు చేయడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. బాలీవుడ్ ప్రముఖులు మత్తులో ఊగిసలాడుతున్న తీరు చూస్తే వాస్తవం లేదా భ్రమలకు తేడా ఏంటో కనిపిస్తుంది. అందుకే తారలు డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకిస్తున్నాను అని ట్వీట్ చేశారు. అయితే వాటిని తారలు ఖండిస్తే.. వీడియోను మళ్లీ షేర్ చూసి నా ఆరపణల్లో తప్పు ఉందో లేదో మీరే నిర్ధారించాలి అని అన్నాడు.

అంత వెధవను కాదని

అంత వెధవను కాదని


ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ ఆరోపణలపై తాజాగా కరణ్ జోహర్ మౌనం వీడారు. బాలీవడ్‌‌లో సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. వారం రోజులు బాగా కష్టపడుతూ ఉండే సినీ తారలు కొందరు ఎంజాయ్ చేయడానికి పార్టీకి వచ్చారు. ఆ సందర్భంగా వారు చక్కగా అనుభూతిని పొందారు. ఆ పార్టీ గురించి వైరల్ అవుతున్న వీడియోను చూసి మీరే చెప్పండి.. అలా పార్టీలో డ్రగ్స్ వినియోగించడం తప్పని తెలియని వెధవను కాదుగా అని కరణ్ జోహర్ అన్నారు.

నా తల్లి కూడా ఆ పార్టీలో

నా తల్లి కూడా ఆ పార్టీలో

బాలీవుడ్ తారలు పాల్గొన్న పార్టీలో నా తల్లి కూడా ఉంది. ఆ వీడియో తీయడానికి 5 నిమిషాల ముందే అక్కడ నుంచి నా తల్లి వెళ్లిపోయారు. అందరూ తమకు తోచినట్టుగా పార్టీని ఎంజాయ్ చేశారు. కొందరు మ్యూజిక్ విన్నారు. మరికొందరు మాట్లాడుకొంటూ ఎంజాయ్ చేశారు. అంతకంటే పెద్దగా జరిగిందేమీ లేదు అని మంజిందర్ సింగ్‌పై కరణ్ కామెంట్లు విసిరారు.

అవాస్తవాలపై స్పందించనని

అవాస్తవాలపై స్పందించనని

తాను నిర్వహించిన పార్టీపై ఎవరో కొందరు చేసిన ఆరోపణలపై నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవాస్తవంతో కూడిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం కూడా లేదు. అలా చవకబారు కామెంట్లపై స్పందిస్తే నాకు ఉండే గౌరవం పోతుందని భావిస్తున్నా. అంత చీప్‌గా అవాస్తవాలతో ప్రజాదరణ పొందాలని చూడటం చవకబారు తనపమే అంటూ కరణ్ జోహర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X