డ్రగ్స్ ఉచ్చులో 150 బాలీవుడ్ తారలు.. 6 టాప్ హీరోలపై నిఘా.. కరణ్ జోహర్ ఉద్యోగి ఇంట్లో సోదాలు
బాలీవుడ్‌తో డ్రగ్స్ రాకెట్ సంబంధాలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా డ్రగ్స్ సప్లయర్ కరమ్ జిత్ సింగ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా భారీ సంఖ్యలో బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. దీపిక పదుకోన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్‌కు సమన్లు జారీ చేసిన తర్వాత ఎన్సీబీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది. డ్రగ్స్ సప్లయర్ కరమ్ జిత్ చెప్పిన విషయాలు ఇవే అంటూ..

తెరపైకి 150 మంది సినీ తారల పేర్లు
గోవా, ముంబైలోని డ్రగ్స్ సప్లయర్ల విచారిస్తున్న సమయంలో భారీగా సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. కరమ్ జిత్ సింగ్ స్వయంగా 150 మంది సినీ నటులు పేర్లను వెల్లడించారు. వారి గురించిన వివరాలను సేకరిస్తున్నదని ఎన్సీబీ పేర్కొన్నది. ఆ జాబితాలో వివరాలు సేకరించిన తర్వాత పలువురికి సమన్లు జారీ చేసి విచారణ కొనసాగిస్తామని చెప్పినట్టు రిపబ్లిక్ టెలివిజన్ కథనాన్ని వెల్లడించింది.

ధర్మ ప్రొడక్షన్ ఉద్యోగికి సమన్లు
డ్రగ్స్ రాకెట్ విచారణలో భాగంగా నలుగురు అగ్ర హీరోయిన్లకు సమన్లు జారీ చేసిన తర్వాత ధర్మ ప్రొడక్షన్ కృష్టి రవి ప్రసాద్‌ను విచారణకు హాజరుకావాలని సూచించారు. విచారణ కోసం శుక్రవారం 11 గంటల ప్రాంతంలో ఆయనను ఎన్సీబీ గెస్ట్‌హౌస్‌కు చేరుకోవాలని సమన్లలో పేర్కొన్నారు.

ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇంట్లో సోదాలు
బాలీవుడ్ తారలకు సమన్లు ఓ పక్క జారీ చేస్తూనే ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్టి రవి ప్రసాద్ నివాసాలపై ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం క్రిష్టిజ్ రవి ప్రసాద్ ఢిల్లీలో ఉండగా, ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ధర్మ ప్రొడక్షన్‌పై కూడా ఎన్సీబీ నజర్ పెట్టినట్టు సమాచారం.

బిక్కుబిక్కు మంటున్న 6 టాప్ హీరోలు
బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌పై ఎన్సీబీ కొరడా ఝులిపిస్తున్న సమయంలో దాదాపు 6 స్టార్ హీరోలు భయాందోళనలకు లోనవుతున్నట్టు సమాచారం. సారా, దీపిక, రకుల్, శ్రద్దాలకు సమన్లు జారీ చేసిన తర్వాత టాప్ హీరోలు తమ లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముంబైలోని ఉన్నత పోలీసు అధికారులకు ఫోన్లు చేసి రక్షించమని వేడుకొంటున్నారని రిపబ్లిక్ టెలివిజన్ ఓ కథనాన్ని ప్రచురించింది.


Click it and Unblock the Notifications











