బాలీవుడ్ టాప్ హీరో, డైరెక్టర్ గుండెల్లో రైళ్లు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. ‘N’పై ఉత్కంఠ
బాలీవుడ్‌తో డ్రగ్ రాకెట్ లింకులపై నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో హిందీ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలు, దర్శకుల గుండెల్లో రైళ్లు పరుగుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. దీపిక పదుకోన్, శ్రద్దా కపూర్, సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు బయటకు రావడంతో ఇప్పడు బడా హీరోలు, దర్శకులు ఆందోళనపడినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో తమ వరకు ఈ కేసు రాకముందే సర్దుకొనే ప్రయత్నం చేసిన దాఖలాలు బట్టబయలు అయ్యాయి. జాతీయ ఛానెల్ సేకరించిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. ఇంతకు ఆ హీరో, దర్శకులు ఎవరంటే...

సెలబ్రిటీలు మాజీ ముంబై కమిషనర్‌కు ఫోన్
బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచనాలు రేపుతున్న క్రమంలో ఓ టాప్ హీరోకు సంబంధించిన మేనేజర్ ఒకరు ఇటీవల రిటైర్డ్ ముంబై కమిషనర్‌కు కాల్ చేసి బయటపడే సలహాలు, సూచనలు ఇవ్వమని కోరినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ బడా హీరో, బడా దర్శకుడు పేర్లను చెప్పి వీరి పేర్లు డ్రగ్స్ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ కేసులో పేర్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆరా తీసినట్టు తెలిసింది.

ప్రముఖ దర్శకుడి ఇంట్లో పార్టీ వీడియో వైరల్
2019లో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ నివాసంలో జరిగిన పార్టీలో బాలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలు, హీరోయిన్లు మత్తులో మునిగిపోయారు. ఆ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, అప్పట్లో ఎమ్మెల్యే ఒకరు ఆ వీడియోపై ఘాటుగా స్పందించడం వివాదమైంది.

టాప్ డైరెక్టర్ పార్టీ వీడియోపై మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
2019లో టాప్ డైరెక్టర్ కరణ్ జోహర్ ఇంట్లో పార్టీకి చెందిన వీడియోపై ప్రస్తుతం అప్పటి ఎమ్మెల్యే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు స్వయంగా ఫిర్యాదు చేయగా మళ్లీ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో చాలా మంది సినీ ప్రముఖులు మత్తులో జోగుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఓ హీరో ఏకంగా డ్రగ్స్ పక్కనే పెట్టుకొని కనిపించడం చర్చనీయాంశమైంది.

ప్రముఖ లాయర్లతో సెలబ్రిటీల సంప్రదింపులు
కరణ్ జోహర్ ఇంటిలో జరిగిన పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలందరూ ఇప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారు ప్రముఖ లాయర్లతో సంప్రదిస్తూ భవిష్యత్‌లో ఎలాంటి ముప్పు రాకుండా, వస్తే వాటి నుంచి బయటపడటం ఎలా అనే విషయాలపై దృష్టిపెడుతున్నట్టు సమాచారం.

ప్రతీ క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని సెలబ్రిటీలందరి గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయనే వార్త బాలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఏ సమయంలో ఎవరి పేరు బయటకు వస్తుందనే గుబులుతో టాప్ హీరో, హీరోయిన్లు టెన్షన్‌తో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో టాప్ హీరో, డైరెక్టర్ తమ పేర్లు రాకుండా శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
Recommended Video

N అంటే ఎవరు..
రియా చక్రవర్తికి చెందిన టాలెంట్ మేనేజర్ జయా సహాను విచారిస్తున్న సమయంలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. జయా సహా వాట్సప్ ఛాట్‌లో D, K, S, N అనే పేర్లలో Dని దీపిక పదుకోన్‌గా, Kను మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌గా, Sను శ్రద్దా కపూర్‌గా డీ కోడ్ చేశారు. ఇక N పేరుతో ఉండే సెలబ్రిటీ పేరు బయటపెట్టకపోవడంతో ఆ పేరు ఎవరిదనే విషయం ఆసక్తిగా మారింది. అయితే టాలీవుడ్‌లో ప్రముఖ హీరో భార్య పేరు మీడియాలో ప్రచారం జరుగుతుండటం సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











