కరీనా కపూర్ ఇంట్లో కరోనా కలకలం.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో..
ప్రముఖ నటుడు, కరీనాకపూర్, కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో రణధీర్ కపూర్ కుటుంబం ఆందోళనకు గురవుతున్నది.
గతేడాది ఏప్రిల్ 30వ తేదీన రణ్‌దీర్ కపూర్ సోదరుడు, ప్రముఖ నటుడు రిషి కపూర్ మరణించిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటనకు మరో రోజు ముందు కపూర్ ఫ్యామిలీ కరోనావైరస్ బారిన పడటం మరింత విషాదంగా మారింది.

రణధీర్ కపూర్ ఆరోగ్యంపై కోకిలాబెన్ హాస్పిటల్ వర్గాలు స్పందించాయి. హాస్పిటల్ సీఈవో, ఈడీ డాక్టర్ సంతోష్ శెట్టి మాట్లాడుతూ.. రణధీర్ కపూర్ కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేరిన విషయం నిజమే. గత రాత్రి నుంచి చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని అన్నారు.
ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ కుమారుడైన రణధీర్ కపూర్ నటుడిగా 70, 80 దశకాల్లో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. హీరోయిన్ బబితాను పెళ్లి చేసుకొన్నారు. ఆయనకు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఇద్దరు కూతుళ్లు.


Click it and Unblock the Notifications











