ఆ సినిమా సమయంలో చాలా జరిగాయి.. షాహిద్ కపూర్‌తో బ్రేకప్‌పై నోరు విప్పిన కరీనా
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, షాహిద్ కపూర్ ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. పెళ్లీ పీఠలెక్కుతారన్న అంతా అనుకంటూ ఉండగా.. విడిపోయి చెరో దారి చూసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ కూడా తమ తమ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. అయితే కరీనా ఇంతవరకు షాహిద్ కపూర్‌తో ప్రేమ, బ్రేకప్ వంటి విషయాల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. తాజాగా ఆమె ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆ సినిమాతో అలా..
జబ్ వీ మెట్ నా సినిమా కెరీర్‌నే మార్చేసింది.. ఆ సినిమాలో షాహిద్ కపూర్‌తో కలిసి నటించాను. నిజం చెప్పాలంటే ఆ సినిమా కథను మొదట షాహిద్ విన్నాడు.. జబ్ వి మెట్ కథ చాలా బాగుంది.. ఆ కథలో అమ్మాయి పాత్ర ఉన్నతంగా ఉంది. నువ్వు తప్పకుండా ఆ సినిమా చెయ్యి అని షాహిద్ చెప్పినట్టు తెలిపింది.

విధి ఆడిన వింత నాటకం..
అలా తాను ఆ సినిమాలో నటించానని తెలిపింది. జబ్ వీ మెట్, తషాన్ సినిమా సమయంతో తమ మధ్య చాలా జరిగిందని చెప్పుకొచ్చింది. మా ఇద్దరి విషయంలో విధి ఆట ఆడుకుందని తెలిపింది. అందుకనే విడిపోయామని, ఎవరి జీవితాల్లో వారు స్థిరపడిపోయాని చెప్పుకొచ్చింది.

ఆ సినిమాతో కలల రాకుమారుడిని
తషాన్ సినిమా షూటింగ్ సమయంలో సైఫ్‌ను కలిశానని తెలిపింది. తషాన్ సినీ కెరీర్‌తో పాటు తన జీవితాన్ని కూడా మారుస్తుందని భావించినట్టు పేర్కొంది. ఓ రకంగా జబ్ వీ మెట్ తన కెరీర్‌ను మారిస్తే.. తషాన్ తన జీవితాన్నే మార్చిసిందని, ఎందుకంటే ఆ సినిమాలోనే తన కలల రాకుమారుడిని కలిశానని, ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చింది.
Recommended Video


సంతోషంగా ఉన్న ఇరు కుటుంబాలు..
ప్రేమతో దగ్గరై.. బ్రేకప్ దూరమయ్యాక కరీనా కపూర్ తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో సంతోషంగా గడిపేస్తుంది. వీరిద్దరికి తైమూర్ అలీ ఖాన్ జన్మించిన సంగతి తెలిసిందే. అటు వైపు షాపిద్ కపూర్ కూడా మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











