అతనితో అఫైర్ కంటే.. ఆ హీరో బ్రేకప్ విషయమే నన్ను కుంగదీసింది.. కరీనా కపూర్

బాలీవుడ్ తెరకు కరీనాకపూర్ పరిచయమై దాదాపు 20 ఏళ్లు పూర్తి కావొచ్చింది. అద్బుతమైన పాత్రలే కాకుండా రూమర్లు, అఫైర్లు, బ్రేకప్‌లు, గాసిప్స్ అన్నీ ఆమె జీవితంలో భాగమయ్యాయి. షాహిద్ కపూర్‌తో అఫైర్ నుంచి హృతిక్ రోషన్‌తో డేటింగ్ రూమర్లు వరకు అనేక అంశాలు ఆమెతో ముడిపడి ఉన్నాయి. అయితే ఇలాంటి వార్తలకు సైఫ్ ఆలీ ఖాన్‌తో పెళ్లి చెక్ పెట్టింది. అయితే తనకు హృతిక్ రోషన్‌తో లింకు పెడుతూ వచ్చిన వార్తలపై కరీనా కపూర్ స్పందిస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం బాలీవుడ్‌లో వైరల్ అవుతున్నది. వివరాల్లోకి వెళితే..

రెఫ్యూజీ సినిమాకు 20 ఏళ్లు

రెఫ్యూజీ సినిమాకు 20 ఏళ్లు

కరీనాకపూర్, అభిషేక్ బచ్చన్ ఇద్దరు బాలీవుడ్ తెరకు పరిచయమై 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాయి. వీరిద్దరి నటించిన రెఫ్యూజీ చిత్రం 2000 సంవత్సరం జూన్ 30 తేదీన విడుదల కావడంతో అభిషేక్, కరీనా కపూర్ బాలీవుడ్ కెరీర్ ఆరంభమైంది. ఆతర్వాత కరీనాకపూర్ కెరీర్ రివ్వున తారాజువ్వలా దూసుకెళ్లింది.

హృతిక్‌తో గురించి కరీనా కపూర్

హృతిక్‌తో గురించి కరీనా కపూర్


2002లో కరీనా కపూర్ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ హృతిక్ రోషన్ గురించి తన అభిప్రాయలను వెల్లడించింది. హృతిక్‌ను చూస్తే నాకు కలల రాకుమారుడిలా కనిపిస్తాడు అని చెప్పింది. దాంతో అప్పటికే వారి డేటింగ్ గురించి మీడియాలో కథనాలు వెలువడటం, కరీనా తన మనసులో మాటను చెప్పడంతో రూమర్లకు ఆజ్యం పోసినట్టు అయింది.

హృతిక్ వైవాహిక జీవితం గురించి

హృతిక్ వైవాహిక జీవితం గురించి

హృతిక్‌తో రిలేషన్ అంటగడుతూ వార్తలు రావడంతో తాను కంగారు పడ్డాను. తనతో అపైర్ ఉందనే వార్తల కారణంగా హృతిక్ దాంపత్య జీవితం ఎక్కడ దెబ్బ తింటుందో అనే భయం నన్ను వెంటాడింది. అంతేకాకుండా ప్రొఫెషనల్‌గా నాకు చాలా ఎఫెక్ట్ అవుతుందనే భయం కలిగింది. ఆ ప్లేస్‌లో హృతిక్ ఉన్నారని భయం కాదు.. రేపు మరో హీరోకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుపడటానికి అవకాశం ఉందనే విషయం నన్ను ఇబ్బందికి గురిచేసింది అని కరీనా చెప్పారు.

ఇద్దరు పిల్లలు, విడాకులు తీసుకొన్న వ్యక్తితో పెళ్లా?

ఇద్దరు పిల్లలు, విడాకులు తీసుకొన్న వ్యక్తితో పెళ్లా?

ఆ తర్వాత సైఫ్ ఆలీఖాన్‌తో కరీనా కపూర్ ప్రేమలో పడటం జరిగింది. అయితే వారిద్దరి ప్రేమ పీకల్లోతులో ఉండటం పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో కరీనాకు తన ఫ్యామిలీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందట. ఇద్దరు పిల్లలు ఉండి భార్యతో డైవోర్స్ తీసుకొన్న వ్యక్తితో పెళ్లా అంటూ కరీనాను నిలదీశారట. అయినా సైఫ్ ఖాన్‌నే పెళ్లి చేసుకోవడానికి సాహసం చేయడం, ఆ తర్వాత పెళ్లి జరగడం అయిపోయింది.

Recommended Video

Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా

పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా

పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం ఒక్క కరీనాకపూర్‌కే చెల్లింది. పెళ్లి, ప్రసవం తర్వాత బ్రేక్ తీసుకొన్న ఆఫర్లు ఆమెను వెంటాడాయి. భారీ బడ్జెట్; అగ్రహీరోల సరసన నటిస్తూ తన స్టామినా రుజువు చేసుకొన్నది. ప్రస్తుతం అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X