ఆ హీరోతో 10 లిప్ కిస్సులు, ప్రియుడితో కూడా కొన్ని.. పెళ్ళికి ముందు బాగోదేమోనని!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో కరీనా కపూర్ ఒకరు. అందం, అభినయంతో కరీనా కుర్రకారుని ఆకర్షించింది. కరీనా కపూర్ డాన్సులకు కూడా యువత పిచ్చెక్కిపోతారు. దశాబ్దం కాలంగా కరీనా బాలీవుడ్‌లో రాణిస్తోంది. సైఫ్ అలీఖాన్‌తో వివాహం తర్వాత సినిమాల జోరు తగ్గింది. కానీ అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లో మెరుస్తోంది. తాజాగా కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రస్తావించింది. కరీనా కపూర్ ఒకప్పుడు వెండి తెరపై లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది.

10 లిప్ లాక్స్
కరీనా కపూర్, అక్షయ్ కుమార్ పదేళ్ల క్రితం కంబఖ్త్ ఇష్క్ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో కరీనా, అక్షయ్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఏ రేంజ్‌లో అంటే ఈ చిత్రంలో వీరిద్దరూ ఏకంగా 10 లిప్ లాక్స్‌లో నటించారు. కరీనా, అక్షయ్ రొమాన్స్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆ తర్వాత కూడా కరీనా తన దూకుడు తగ్గించలేదు. గ్లామర్ రోల్స్ చేస్తూ రొమాన్స్‌తో అదరగొట్టేది.

ప్రియుడితో కూడా
ఇక కరీనా కపూర్ తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ తో జబ్ వి మెట్ చిత్రంలో కొన్ని ముద్దు సన్నివేశాల్లో నటించింది. షాహిద్, కరీనా ప్రేమ వ్యవహారం గురించి వార్తలు జోరందుకుంది ఈ చిత్రంతోనే. తాను లిప్ లాక్ సన్నివేసానికి నో చెప్పిన ఒకే ఒక్క హీరో అజయ్ దేవగన్ అని కరీనా అంటోంది. అజయ్ దేవగన్ తో ముద్దు సన్నివేశానికి ఎంతో నో చెప్పాల్సి వచ్చిందో కరీనా వివరించింది.

మరి కొద్ది రోజుల్లోనే వివాహం
మరి కొద్ది రోజుల్లోనే సైఫ్ అలీ ఖాన్ తో వివాహం జరుగుతుంది అనగా.. ఆ సమయంలో సత్యాగ్రహ చిత్రంలో నటించినట్లు కరీనా తెలిపింది. ఆ చిత్రంలో అజయ్ దేవగన్, నేను లిప్ లాక్ సన్నివేశంలో నటించాలి. కానీ త్వరలో పెళ్లి ఉండడంతో బాగోదని నో చెప్పా. పెళ్లి తర్వాత కరీనా లిప్ లాక్ సన్నివేశంలో నటించలేదు.

సినిమాలు కొనసాగిస్తూ
పెళ్లి తర్వాత కరీనా గ్లామర్ రోల్స్ ని దూరం పెట్టింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన గుడ్ న్యూస్ చిత్రంలో నటిస్తోంది. రేడియో షోకు హోస్ట్ గా కూడా మారింది. వాట్ ఉమెన్ వాంట్ అనే షోకు కరీనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరీనా కపూర్, సైఫ్ దంపతుల కుమారుడు తైమూర్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న తైమూర్ ఫోటోలు ప్రతి రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











