కొడుకును క్రికెటర్ చేస్తానంటున్న బాలీవుడ్ నటి

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపింది బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్. హిందీలోని సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరు హీరోలతో నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. సినిమాలతో పాటు వ్యాపార ప్రకటనల్లోనూ తన సత్తా చాటింది. ఎన్నో సౌందర్య సాధనాలను ప్రమోట్ చేసింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. అతడి పేరు తైమూర్ అలీ ఖాన్. ఈ బుడ్డోడు కూడా బాగా ఫేమస్.

సైఫ్ - కరీనా ఎక్కడకు వెళ్లినా తైమూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. అతడి ఫొటోలను తరచూ ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో చిన్నోడు కూడా బాగా పాపులర్ అయిపోయాడు. వాస్తవానికి తైమూర్ అని పేరు పెట్టిన సమయంలోనే కరీనా - సైఫ్ దంపతులు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. దీనికి కారణం అతడికి పెట్టిన పేరు మన దేశంపై దండెత్తిన ఓ ముస్లిం రాజు పేరు కావడమే. తాజాగా ఈ బుడ్డోడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. దీనికి కారణం కరీనా చేసిన వ్యాఖ్యలే.

Kareena Kapoor about Taimur Ali Khan future

ఇటీవల కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె ఎండార్స్ చేస్తున్న సంస్థ ఏర్పాటు చేసిన ఈ ఇంటర్వ్యూలో కరీనా ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగానే తన కుమారుడి గురించి కూడా కీలక విషయాన్ని వెల్లడించింది. 'తైమూర్‌కు క్రికెటర్ చేయాలని అనుకుంటున్నాం. వాళ్ల తాత టైగర్ పటౌడీ గతంలో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించారు. కాబట్టి, తాతలానే తైమూర్‌ను కూడా క్రికెటర్ చేయాలని అనుకుంటున్నాం' అని ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X