సినీ రంగంలో పెను సంచలనం.. మరో స్టార్ కపుల్ విడాకులు!

ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీల్లోనూ లవ్ ట్రాకులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది నటీనటులు డేటింగ్‌లలో మునిగి తేలారు. అందులో కొందరైతే తమ బంధాలను పెళ్లి వరకూ తీసుకు వెళ్లారు. అందులో బాలీవుడ్ స్టార్లు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ జోడీ ఒకటి. వీళ్లిద్దరి పెళ్లి ఎన్నో ఊహించని పరిణామాల నడుమ జరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వీళ్లిద్దరి వైవాహిక జీవితం సంతోషంగానే సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనే ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతుందని ఓ న్యూస్ లీకైంది. ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!

ఆమెకు ఫస్ట్.. సైఫ్‌కు సెకెండ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గతంలో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. భార్య నుంచి విడిపోయిన తర్వాత అతడు.. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌తో డేటింగ్ చేశాడు. ఇలా వీళ్లిద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితమే కరీనా - సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

Kareena Kapoor and Saif Ali Khan Divorce News Goes Hot Topic in Social Media

ఇద్దరు పిల్లలు.. ప్రెగ్నెన్సీతో
సైఫ్ అలీ ఖాన్‌తో వివాహం తర్వాత సంసార జీవితాన్ని కరీనా కపూర్ సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. పెళ్లైన కొంత కాలానికే ఈ జంటకు ఓ బాబు జన్మించాడు. అలాగే, ఈ మధ్యనే రెండో బిడ్డకు కూడా కరీనా జన్మనిచ్చింది. ఈ పిల్లలకు 'తైమూర్', 'జహంగీర్' అనే పేర్లు పెట్టారు. వీళ్లు ఈ ఇద్దరితో పాటు మరో బిడ్డను కూడా కనబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఎవరి మూవీలతో వాళ్లు బిజీ
వివాహం జరిగిన తర్వాత కూడా కరీనా కపూర్ తన యాక్టింగ్ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇద్దరు బిడ్డల తల్లైనా ఈ అమ్మడు ఏమాత్రం తగ్గకుండా వరుసగా మూవీలు చేస్తోంది. ఇలా ఇప్పటికే 'క్రూ' అనే మూవీ చేసింది. అలాగే, 'సింగం ఏగైన్'లోనూ నటిస్తోంది. అలాగే, సైఫ్ కూడా ఎన్నో చిత్రాల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా 'దేవర'లో విలన్ పాత్రను చేస్తున్నాడు.

Kareena Kapoor and Saif Ali Khan Divorce News Goes Hot Topic in Social Media

విడాకుల గురించి పుకార్లతో
పెళ్లి జరిగిన తర్వాత నుంచి సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ ఎంతో చక్కగా ఉంటోన్నారు. అదే సమయంలో ఇద్దరూ తమ తమ కెరీర్‌లను కూడా కొనసాగిస్తూ కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోన్నారు. అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవలు జరుగుతున్నాయని, ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతుందని ఎప్పటి నుంచో ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి.

ఆమె టాటూ తీసేసిన సైఫ్
ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల వల్ల సినీ సెలెబ్రిటీలు ఏం చేసినా హాట్ టాపిక్ అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో తన చేతి మీద వేసుకున్న 'కరీనా' అనే టాటూను సైఫ్ అలీ ఖాన్ తొలగించాడు. దాని స్థానంలో ఓ త్రిశూలం టాటూను వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Kareena Kapoor and Saif Ali Khan Divorce News Goes Hot Topic in Social Media

విడాకులు కన్ఫార్మ్ అంటూ
సైఫ్ అలీ ఖాన్ తన చేతి మీద ఉన్న భార్య పేరు పచ్చబొట్టును తీసేయడంతో ఇప్పుడు వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. చాలా మంది అతడి చేతికి సంబంధించిన పాత, కొత్త ఫొటోలను షేర్ చేస్తూ కరీనాతో సైఫ్ విడిపోతున్నాడని వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X