Kareena Kapoor Pregnant: డౌట్లు పెంచేసిన కరీనా లేటెస్ట్ ఫోటో.. మూడోసారి తల్లి కావడంపై క్లారిటీ

దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాలో స్టార్‌గా వెలుగొందిన నటీమణుల్లో కరీనా కపూర్ ఒకరు. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ వచ్చిన ఆమె.. వివాహం తర్వాత మాత్రం స్పీడు తగ్గించేసింది. దీంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరీనా కపూర్ మూడోసారి తల్లి కాబోతుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం ఇటీవల ఆమె బేబీ బంప్ ఉన్నట్లుగా కనిపించడమే. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కరీనా కపూర్ దీనిపై స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా వదిలింది. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

అలా మొదలైన కరీనా కెరీర్

అలా మొదలైన కరీనా కెరీర్

కరీనా కపూర్ చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ రంగంలో తన అందచందాలతో మాయ చేసింది. ఆ తర్వాత అంటే 2000లో 'రెఫూగీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే కరీనా ఎన్నో విజయాలను అందుకుని స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకుంది.

ఆ హీరోకు కరీనా రెండో భార్య

ఆ హీరోకు కరీనా రెండో భార్య

సుదీర్ఘమైన ప్రయాణంలో బాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితమైనా.. కరీనా కపూర్ దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. అలా చాలా కాలంగా హవాను చూపించింది. దీంతో ఫ్యాన్ బేస్‌ను కూడా భారీగా పెంచుకుంది. ఇక, ఆమె అందరికీ షాకిస్తూ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ రెండో భార్య అవడం అప్పట్లో సంచలనం అయింది.

పెళ్లైనా కెరీర్‌ను కొనసాగిస్తూ

పెళ్లైనా కెరీర్‌ను కొనసాగిస్తూ


సాధారణంగా సినీ రంగంలో పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లను ముగిస్తుంటారు. కానీ, సైఫ్‌తో పెళ్లైన తర్వాత కూడా కరీనా కపూర్ తన ప్రయాణాన్ని ఆపలేదు. అంతేకాదు, తల్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. అంతేకాదు, ఆమె కొన్ని హాట్ సీన్లలో నటించింది. అయితే, ఆమె చేతిలో ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' మూవీ మాత్రమే ఉంది.

ఇద్దరు బిడ్డలకు తల్లైన నటి

ఇద్దరు బిడ్డలకు తల్లైన నటి


బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ను పెళ్లాడిన తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్, రెండో కుమారుడికి 'జహంగీర్' అని కరీనా దంపతులు పేరు పెట్టారు. ఈ రెండు పేర్లు పెట్టిన సమయంలో వివాదాలు కూడా చెలరేగాయి. దీంతో ఈ చిన్నారులు ఫేమస్ అయ్యారు.

మళ్లీ కరీనా కపూర్ ప్రెగ్నెంట్

మళ్లీ కరీనా కపూర్ ప్రెగ్నెంట్


స్టార్ హీరో కరీనా కపూర్ ఇప్పటికే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మూడోసారి ప్రెగ్నెంట్ అయిందంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం ఇటీవలే ఆమె దిగిన ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇందులో ఆమె బేబీ బంప్ ఉన్నట్లుగా కనిపించింది. అప్పటి నుంచి కరీనా కపూర్ మూడో ప్రెగ్నెన్సీ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది.

ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ

ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ

కరీనా కపూర్ మూడోసారి తల్లి కాబోతుందంటూ వస్తున్న వార్తలపై తాజాగా ఆమె స్పందించింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు సమాధానం ఇస్తూ 'ఇది పాస్తా, వైన్ గాయ్స్.. నేను ప్రెగ్నెంట్ కాదు. సైఫ్ ఇప్పటికే మన దేశ జనాభాకు చాలా సహకారం అందించానని అంటున్నాడు' అంటూ చెప్పుకొచ్చింది. ఇలా తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న పుకార్లుకు కరీనా పుల్‌స్టాప్ పెట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X