తిట్టినవారి కంటే చూసిన వారే అధికం.. కబీర్‌సింగ్‌పై విచారకరం.. కరీనా సెన్సేషనల్ కామెంట్స్

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాను ఎన్ని వివాదలు చుట్టిముట్టాయో అందరికీ తెలిసిందే. టీవీల్లో గంటల తరబడి చర్చలు జరిపారు. గోడలపై ఉన్న పోస్టర్స్‌ను సైతం చించేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. రికార్డు కలెక్షన్లను సాధించింది.

అర్జున్ రెడ్డి బాలీవుడ్‌కు కబీర్‌సింగ్‌గా..

అర్జున్ రెడ్డి బాలీవుడ్‌కు కబీర్‌సింగ్‌గా..

టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌ను తెరకెక్కించాడు. అక్కడ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. పనిగట్టుకుని మీర కబీర్ సింగ్‌పై విమర్శనాస్త్రాలు సందించారు.

కబీర్‌సింగ్ పాత్ర చిత్రీకరణపై విమర్శలు..

కబీర్‌సింగ్ పాత్ర చిత్రీకరణపై విమర్శలు..

కబీర్ సింగ్ మరీ సైకోలా ప్రవర్తించాడని, తన ఇష్టానికి అమ్మాయిని లాగడం, పట్టుకోవడం, కొట్టడం లాంటివాటిపైనా విమర్శలు చేశారు. స్త్రీలను కావాలనే అలా చేస్తున్నారని, పురుషాహంకారం అంటూ సినిమాపై విరుచుకపడ్డారు. బాలీవుడ్ మీడియాలొ ఓ వర్గం కావాలనే కబీర్ సింగ్‌ను టార్గెట్ చేసినట్లు అనిపించింది.

ఘటుగా సమాధానం ఇచ్చిన దర్శకుడు..

ఘటుగా సమాధానం ఇచ్చిన దర్శకుడు..

అయితే ఎన్ని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కబీర్ సింగ్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. మూడు వందల కోట్లను కొల్లగొట్టి అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఇక ఈ మూవీపై చేసిన విమర్శలను దర్శకుడు కూడా గట్టిగానే తిప్పికొట్టాడు. అది కేవలం సినిమా.. దాన్ని మీరు ఎందుకింత హైలెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ సందీప్ ఫైర్ అయ్యాడు.

తాజాగా కరీనా కపూర్ స్పందన..

తాజాగా కరీనా కపూర్ స్పందన..

ఓ వేడుకలో పాల్గొన్న కరీనా కపూర్‌ కబీర్ సింగ్‌పై స్పందించి.. నేను ఆ చిత్రాన్ని చూడలేదు అయినా దాని వల్ల వచ్చే నష్టమేమీ లేదు. అయితే సినిమా గురించి వచ్చిన కామెంట్లను నేను విన్నాను. సినిమా తిట్టేవారు ఎంత మంది ఉన్నా.. అంతకంటే ఎక్కువ మందే ప్రేమించిన వారుండటం విచారకరం. అయితే ప్రజలు తమ అభిప్రాయాలను బయటకు చెప్పారు అది సంతోషించాల్సిన విషయం. నా వ్యక్తిగతానికి వస్తే.. కబీర్ సింగ్‌లో కియారా పాత్ర నన్ను ఏ మాత్రం ప్రభావిత చేయదు.. ఎందుకంటే అది కేవలం సినిమాలోని ఓ క్యారెక్టర్ మాత్రమేనంటూ చెప్పుకొచ్చింది.

Recommended Video

Malaika Arora Topless Pic Goes Viral | ఘాటు అందాలతో కనువిందు
ఒకప్పటి ప్రేమపక్షులు..

ఒకప్పటి ప్రేమపక్షులు..

జబ్ వీ మెట్ చిత్రంతో కలసిన షాహిద్ కపూర్, కరీనా కపూర్‌లు ఒకానొక సమయంలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే విధి వశాత్తు వారిద్దరు విడిపోయి.. వేరొకర్ని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ ఎవరి ఫ్యామిలీతో వారు ఆనందంగా గడిపేస్తున్నారు. కబీర్ సింగ్‌పై కరీనా చేసిన కామెంట్స్‌కు షాహిద్ రిప్లై ఇస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X