»   »  కరీనాకపూర్‌కు చేదు అనుభవం.. ముస్లింను పెళ్లిచేసుకొన్నందుకే సిగ్గుపడాలి అంటూ..

కరీనాకపూర్‌కు చేదు అనుభవం.. ముస్లింను పెళ్లిచేసుకొన్నందుకే సిగ్గుపడాలి అంటూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటనపై కరీనాకపూర్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. లైంగిక దాడి ఘటనకు సంబంధించిన వ్యవహారంపై తన నిరసన వ్యక్తం చూస్తూ ప్లకార్డు ప్రదర్శన నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరీనా షేర్ చేసిన ఫోటోపై ఓ వ్యక్తి తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ నోటిదురుసును బయటపెట్టారు. మతాన్ని ఉద్దేశించి నెటిజన్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

బాలికకు న్యాయం చేయాలి

బాలికకు న్యాయం చేయాలి

జమ్ము, కశ్మీర్‌లోని కతువాలో ఓ చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని నిరసిస్తూ తన సహచరి నటి స్వరభాస్కర్‌తో కలిసి ప్లకార్డు ప్రదర్శన నిర్వహించారు. ఆమెకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్వహించారు.

అంత క్రూరంగా లైంగిక దాడా?

అంత క్రూరంగా లైంగిక దాడా?

నేను హిందూస్థాన్‌కు చెందిన వ్యక్తిని. ఈ దారుణాన్ని చూసి సిగ్గుపడుతున్నాను. చిన్నారికి న్యాయం జరుగాలి. 8 ఏళ్ల బాలికను గ్యాంగ్‌రేప్ చేస్తారా? క్రూరంగా హత్య చేస్తారా? పవిత్ర ఆలయంలో ఇంత క్రూరమైన ఘటనా? అని కరీనా కపూర్ ప్లకార్డు ప్రదర్శిస్తూ ఆ ఫోటోను కథువా అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించి షేర్ చేశారు. అయితే కరీనా కపూర్ సోషల్ మీడియాలో లేకపోవడంతో ఆ ఫోటోను స్వరభాస్కర్ షేర్ చేశారు.

కరీనాపై ఎదురుదాడి

కరీనాపై ఎదురుదాడి

కరీనా కపూర్ ట్యాగ్ చేసిన ఫోటోపై ఓ నెటిజన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందువైన నీవు ముస్లింను పెళ్లి చేసుకొన్నందుకు సిగ్గుపడాలి. అతడి ద్వారా జన్మనించిన బిడ్డకు క్రూరమైన ముస్లిం రాజు తైమూరు పేరు పెట్టుకొన్నావు. ఇంతకంటే సిగ్గు ఏముంటుందని నెటిజన్ ప్రశ్నించారు.

నీవే సిగ్గుపడాలని స్వరభాస్కర్

నీవే సిగ్గుపడాలని స్వరభాస్కర్

అయితే నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై నటి స్వరభాస్కర్ మండిపడ్డారు. నీవు పుట్టినందుకే సిగ్గుపడాలి. ఎలా వ్యవహరించాలో తెలుసుకొనేందుకు నీకు బుర్రను ఇచ్చాడు. నోటికి వచ్చినట్టు అలా చెండాలంగా మాట్లాడుతావా? నీవు భారతీయుడిగా, హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడాలి. బహిరంగంగా ఇంత నీచంగా మాట్లాడుతావా? అని నెటిజన్‌కు స్వరభాస్కర్ సమాధానం ఇచ్చింది.

 లవ్ జిహాద్ అని

లవ్ జిహాద్ అని

ప్రముఖ నటుడు సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ 2016లో వివాహం చేసుకొన్నారు. వీరి వివాహం లవ్ జిహద్‌లో భాగమని హిందూ సంప్రదాయవాదులు భగ్గుమన్నారు. విశ్వహిందూ పరిషత్ సంస్థ బుర్ఖా వేసుకొన్నట్టు కరీనా కపూర్ ఫొటోను మార్ఫింగ్ చేసి ప్రచురించారు.

జూన్1న వీర్ దీ వెడ్డింగ్

జూన్1న వీర్ దీ వెడ్డింగ్

ప్రస్తుతం కరీనా కపూర్ వీర్ దీ వెడ్డింగ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో స్వరభాస్కర్ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. శశాంక ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Kareena Kapoor Khan was majorly trolled after a picture of her holding a placard asking for #JusticeForOurChild went viral. Since Kareena is not on social media, her Veere Di Wedding co-actor Swara Bhasker shared the photo of Kareena with the placard, asking for justice for the eight-year-old girl, who was gangraped and murdered in Jammu and Kashmir's Kathua district. As soon as the picture was shared, Kareena was slammed for marrying a Muslim, Saif Ali Khan, and for naming her son Taimur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X