మీ ప్రేమని ప్రపంచం మొత్తం చూసింది.. కానీ భర్తగా ఎలా ఉండాలో నేర్చుకో!
కరీనా కపూర్ హోస్ట్ గా 'వాట్ వుమెన్ వాంట్' అనే రేడియో షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు చాలా మంది సెలెబ్రిటీలు అతిథులుగా హాజరవుతున్నారు. జాతీయ స్థాయిలో కరీనా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం బాగా పాపులర్ అవుతోంది. కరీనా కపూర్ ఈ షోలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. షోకు హాజరైన అతిథులతో కూడా ఓపెన్ గా అన్ని విషయాల గురించి చర్చిస్తుంది. ఇటీవల జరిగిన ఈ షోలో స్టార్ హీరో రణవీర్ సింగ్ పాల్గొన్నాడు. రణవీర్, కరీనా మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

ప్రపంచం మొత్తం
ఈ షోలో రణవీర్ సింగ్ కరీనా కపూర్ ని ఆసక్తికర ప్రశ్న అడిగాడు. మంచి భర్తగా ఎలా ఉండాలో కొన్ని టిప్స్ చెప్పమని అడిగాడు. దీనికి కరీనా సరదాగా స్పందించింది. దీపికతో నీ ప్రేమని ప్రపంచం మొత్తం చూసింది. నీకు సపరేటుగా నేను టిప్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించింది. కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ 2012లో వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు.

మంచి భర్తగా ఉండాలంటే
కరీనా కపూర్ రణవీర్ తో అంటూ.. దీపికా, నువ్వు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. కానీ మంచి భర్తగా ఎలా ఉండాలో ఒక్క చిట్కా చెబుతాను. ఇది మ్యాజిక్ లాగా వర్కౌట్ అవుతుంది. ఒకరికొకరు స్వేచ్ఛ కల్పించుకోండి.. అంతా సాఫీగా సాగిపోతుంది అని కరీనా రణవీర్ తో తెలిపింది. రణవీర్, దీపికా పదుకొనె ఆరేళ్ళ సహజీవనం తర్వాత గత ఏడాది నవంబర్ లో వివాహం చేసుకున్నారు.

సైఫ్ అలీఖాన్ కూడా
ఆ మధ్యన సైఫ్ అలీఖాన్ కూడా రణవీర్ తరహాలోనే ఓ ప్రశ్న అడిగాడు. ఇబ్బందులు ఎదురైనప్పుడు భ్యార్యని మా వైపు ఎలా తిప్పుకోవాలి అని ప్రశ్నించాడు. దీనికి కరీనా బదులిస్తూ.. రేడియోలో ఎవరైనా ఇలాంటి ప్రశ్న అడుగుతారా అని వ్యాఖ్యానించింది. నువ్వు అడిగావు కాబట్టి సమాధానం ఇస్తాను. పిల్లలు పుట్టాక కుటుంబంలో భాద్యతలు పెరుగుతాయి. వాటిని భార్య భర్తలు ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. కొంత సమయం కేటాయించి భార్యని అందమైన ప్రదేశానికి తీసుకువెళ్ళండి అని కరీనా బదులిచ్చింది.

ఇద్దరూ జంటగా
ఇక రణవీర్ సింగ్, కరీనా కపూర్ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. వివాహానికి ముందు వీరిద్దరూ పద్మావత్, రామ్ లీలా లాంటి చిత్రాల్లో కలసి నటించారు. వివాహం తర్వాత వీరిద్దరూ తొలిసారి జంటగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న 83లో. ఈ చిత్రంలో రణవీర్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా, దీపికా ఆయన సతీమణి పాత్రలో నటించబోతోంది ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











