వారానికి ఐదు సార్లు అది కావాల్సిందే .. ఓపెన్‌గా చెప్పేసిన కరీనా కపూర్

ఎంతటి సెలబ్రెటీలైనా, కోట్లాది మంది అభిమాన గణం ఉన్నా హీరో హీరోయిన్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు కూడా ఇష్టాయిష్టాలు, అలవాట్లు ఉంటాయి. కొందరు స్టార్స్‌కున్న అలవాట్లు తెలిస్తే ముక్కున వేలేసుకోకుండా ఉండలేం. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ సతీమణి కరీనా కపూర్ తనకున్న అలవాట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏం చెప్పారో? చూస్తే .

బాలీవుట్ నట దిగ్గజం రాజ్ కపూర్ మనవరాలు కరీనా కపూర్. రణధీర్ కపూర్, బబిత కపూర్‌ల కుమార్తె. 1980 సెప్టెంబర్ 21న ముంబైలో జన్మించిన కరీనా కపూర్.. లాయర్ కావాలని అనుకున్న ఈ ముద్దుగుమ్మ లా కాలేజ్‌లో చేరి తొలి ఏడాదికే సినిమాల వైపు మనసు మళ్లీంది. దీంతో బాలీవుడ్‌లో ప్రఖ్యాత నటగురువు కిషోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దింది. 2000వ సంవత్సరంలో రెఫ్యూజీ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు కరీనా కపూర్తి తన క్యూట్ లుక్, యాక్టింగ్స్‌తో తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న కరీనా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

Kareena Kapoor Khan want that for five times a week here is the Bollywood actress food habits

ఆ తర్వాత ముఝే కుచ్ కెహ్నా హై, అజ్నాబీ, కబీ కబీ కబీ గమ్, చమేలీ, దేవ్, ఓంకార, ఓతెల్లో, జబ్ వీ మీట్, త్రీ ఇడియట్స్ , వీ ఆర్ ఫ్యామిలీ, గోల్‌మాల్ 3, బాడీగార్డ్, రా వన్, ఎక్ మైనే ఔర్ ఏక్ తు, తలాష్, సింగమ్ రిటర్న్స్, బజరంగీ భాయిజాన్, ఉడ్తా పంజాబ్ తదితర చిత్రాలతో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా, భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఈ దశలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడ్డ కరీనా ఆయనతో కొన్నాళ్లు డేటింగ్ చేశారు.

అనంతరం అక్టోబర్ 16, 2012లో సైఫ్ అలీఖాన్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. తన పేరును కరీనా కపూర్ ఖాన్‌గా మార్చుకున్నప్పటికీ హిందూ మతాన్నే అనుసరిస్తున్నారు కరీనా. పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ బాలీవుడ్‌లో ఇప్పటికీ ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచారు . అయితే తనకున్న క్రేజ్, వివాహం నేపథ్యంలో కథాబలం ఉన్న క్యారెక్టర్లు చేస్తూ దూసుకెళ్తున్నారు. గతేడాది క్రూ, సింగమ్ ఎగైన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు కరీనా కపూర్. ఆ తర్వాత కొత్తగా ఆమె ఏ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు.

ఇక ఈ ఏడాది ప్రారంభంలో తన భర్త సైఫ్ అలీఖాన్‌పై దాడితో కరీనా కపూర్ షాక్ అయ్యారు. జనవరి 16న తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో సైఫ్ ఇంట్లోకి ఓ అగంతకుడు చొరబడి చోరీకి ప్రయత్నించాడు. అతనిని గమనించి పని మనుషులు దొంగని పట్టుకునేందుకు యత్నించగా.. ఈ గొడవతో సైఫ్ అలీఖాన్ నిద్రలేచి తను కూడా దొంగని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సైఫ్‌పై దుండగుడు దాడి చేసి వీపు భాగంలో కత్తితో పొడిచాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సైఫ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన నుంచి కరీనా కపూర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కరీనా కపూర్ ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కిచిడి అంటే చచ్చేంత ఇష్టమని.. అది లేకుండా నేను ఉండలేనని తెలిపారు. కనీసం వారానికి ఐదు సార్లైనా అది తినకుండా ఉండలేనని.. అప్పుడు కానీ నాకు నిద్రపట్టదని పేర్కొన్నారు. ప్రస్తుతం కరీనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కిచిడి అంటే ఎందుకంత పిచ్చి అంటూ ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: kareena kapoor khan movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X