ఆ హీరోతో తిరగవద్దు.. హీరోయిన్‌కు క్లాస్ పీకిన సవతి తల్లి!
హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఏడాది కూడా కాలేదు, అప్పుడే మీడియాలో అఫైర్ల గోల ఎక్కువైనట్టు కనిపిస్తున్నది. గతంలో యువ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ధోని ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో సైఫ్ ఫ్యామిలీ అలర్ట్ అయిందట. ఏకంగా సవతి తల్లి కరీనా కపూర్ ఖాన్ రంగంలోకి సారాను హెచ్చరించిందట. వివరాల్లోకి వెళితే..

సుశాంత్ సింగ్ బర్త్ డే పార్టీలో
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన బర్త్ డేను ఇటీవల జరుపుకొన్నారు. సుశాంత్ కోసం ప్రత్యేకంగా డెహ్రాడూన్ నుంచి సారా వచ్చింది. అర్ధరాత్రి కేక్ పట్టుకొని సుశాంత్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. డిన్నర్ డేట్ తర్వాత సారాను తన అపార్ట్‌మెంట్ వద్ద సుశాంత్ వదిలేసి వెళ్లడం మీడియా కంట పడింది.

సారాతో సుశాంత్ డేటింగ్ వ్యవహారం
సారా, సుశాంత్ వ్యవహారం మీడియాలో గోలగోలగా మారింది. వారి రిలేషన్‌షిప్‌పై రూమర్లు పెరిగిపోయాయి. దాంతో సారా స్వయంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీడియాలో తన అఫైర్ గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని స్పష్టం చేసింది.

సారాకు కరీనా కపూర్ మందలింపు
సారా, సుశాంత్ డేటింగ్ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో సైఫ్ దంపతులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా సారాను జాగ్రత్తగా ఉండాలి. కెరీర్‌పై దృష్టిపెట్టాలి అని కరీనా కపూర్ ఖాన్ మందలించినట్టు తెలిసింది. అయితే కరీనా సూచనలపై సారా పెద్దగా స్పందిచినట్టు కనిపించలేదనేది బాలీవుడ్ పత్రికల కథనం.

వరుస సక్సెస్‌లతో సారా ఆలీ ఖాన్
కాగా, వరుస విజయాలు, సినిమాలతో సారా కెరీర్ బ్రహ్మండంగా ఆరంభమైంది. కేదార్ నాథ్, సింబా చిత్రాలతో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకొన్నది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నది. ఓ వైపు అఫైర్ వార్తలు, సక్సెస్‌లతో మీడియాలో సారా ప్రముఖంగా నిలువడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











