For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరీనాకపూర్‌కు తప్పని నిరాశ.. తండ్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయినా...

    |

    ప్రముఖ బాలీవుడ్ నటుడు, కరీనాకపూర్ ఖాన్ తండ్రి రణ్‌ధీర్ కపూర్ కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతూ కోకిలాబెన్ హాస్పిటల్‌లో కొద్ది రోజుల క్రితం చేరిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలించడంతో ఆయన హాస్పిటల్ నుంచి శుక్రవారం రాత్రి డిశ్చార్జి అయ్యారు. ఆయనకు కరోనావైరస్ నెగిటివ్ రావడంతో వైద్యులు ఇంటికి పంపించారు.

    అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసే సమయంలో వైద్యులు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడంతో కుటుంబ సభ్యులు కొంత నిరాశకు, ఆందోళనకు గురయ్యారు. ఇంటి సభ్యుల్లో ఎవరితోనూ కలువ కూడదని, ఒకవేళ కలిస్తే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.

    Kareena Kapoors Father Randhir Kapoor discharged from Kokilaben Ambani Hospital

    హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత రణ్‌ధీర్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ.. నన్ను నా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండమని చెప్పారు. హస్పిటల్ సిబ్బంది చాలా కేర్ తీసుకొన్నారు. అందుకు ధన్యవాదాలు. దేవుడి దయవల్ల నాకు ఆక్సిజన్ సపోర్ట్‌ గానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తలేదు అని చెప్పారు.

    దీంతో రణ్‌ధీర్‌ కపూర్‌ను ఇంటిలోని ప్రత్యేక గదిలోకి ఉంచారు. ఆయన క్వారంటైన్‌లో పెట్టి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల పాటు ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    English summary
    Kareena Kapoor's Father Randhir Kapoor discharged from Kokilaben Ambani Hospital: few days ago Randhir Kapoor tested Coronavirus positive. He admitted to Kokilaben Ambani Hospital in Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X