twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kareena Kapoor రెండో బిడ్డ పేరుపై నెటిజన్ల భగ్గు.. హిందువులను ఊచకొత కోసిన ఖిల్జీ, చంఘీజ్ ఖాన్ పెట్టుకో అంటూ

    |

    బాలీవుడ్ స్టార్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు. తన మొదటి కుమారుడికి తైమూర్ అంటూ పెట్టిన పేరు విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. భారతదేశంపై దండయాత్ర చేసిన తైమూర్ పేరు పెట్టడం అప్పట్లో అత్యంత వివాదంగా మారింది. అయితే తన రెండో కొడుకు పేరు విషయంలో కరీనా కపూర్ దంపతులు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.

    తన రెండో కుమారుడి పేరును దాచిపెడుతూ అవాస్తవాన్ని బయటపెట్టిన కరీనాకపూర్ దంపతులను నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. ఇంతకు కరీనా తన రెండో కుమారుడికి ఏం పేరు పెట్టారంటే.. ఆ పేరు ఎందుకు వివాదంగా మారిందంటే..

    Kareena Kapoor Khan రెండో కొడుకు పేరు వివాదంగా.. ఏం పేరు పెట్టారు? ఎందుకు ట్రెండ్ అవుతున్నదంటే?Kareena Kapoor Khan రెండో కొడుకు పేరు వివాదంగా.. ఏం పేరు పెట్టారు? ఎందుకు ట్రెండ్ అవుతున్నదంటే?

    భారత్‌పై దండయాత్ర చేసిన రాజు పేరు

    భారత్‌పై దండయాత్ర చేసిన రాజు పేరు

    కరీనా కపూర్ తన మొదటి కుమారుడు తైమూర్ పేరు అప్పట్లో వివాదంగా మారింది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహారించిన ముస్లిం రాజు పేరు పెట్టడం ఏమిటి? అని భారీగా ట్రోల్ చేశారు. అయినా అలాంటి కామెంట్లకు కరీనా దంపతులు సమాధానం ఇవ్వకుండా తైమూర్‌ పేరును కొనసాగించారు. అయితే ఇటీవల జన్మించిన రెండో బిడ్డకు జెహ్ అని పేరు పెట్టినట్టు కరీనా తండ్రి రణ్‌ధీర్ కపూర్ వెల్లడించారు. దాంతో జెహ్ పేరులో వివాదం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

    రెండో కుమారుడి పేరు జహంగీర్

    రెండో కుమారుడి పేరు జహంగీర్

    అయితే తాజాగా కరీనా, సైఫ్ దంపతుల కుమారుడి పేరు జెహ్ కాదు.. జహంగీర్ అనే విషయం బయటకు వచ్చింది. దాంతో కరీనా రెండో కుమారుడి పేరు కూడా వివాదంగా మారింది. తైమూర్, జహంగీర్ అని పేర్లు పెట్టుకొంటారా అని నిలదీస్తున్నారు. దేశాలపై దండయాత్ర చేసిన రాజుల పేర్లు పెట్టుకోవడం భారతీయ సంస్కృతికి విరుద్ధం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తైమూర్ పేరు ట్రెండింగ్‌గా మారింది.

    హిందువులను ఊచకోత కోసిన

    లక్షలాది హిందువులను ఊచకోత కోసిన తైమూర్ ఓ ఉగ్రవాది. 1606 జూన్ 16న గురు అర్జున్ దేవ్ జీని చంపమని జహంగీర్ ఆదేశాలు జారీ చేశాడు. సిక్కుల గురువు గురు నానక్‌ను ప్రార్థించవద్దంటూ ఐదురోజులపాటు టార్చర్ చేసి తైమూర్ చంపించాడు. అలాంటి వాడి పేరును కొడుకుగా పెట్టుకొన్న కరీనా కపూర్ సీత పాత్రలో కనిపిస్తే అంతకంటే దారుణం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

    ఐదో సిక్కు గురు అర్జన్ చంపిన జహంగీర్..

    ఐదో సిక్కు గురు అర్జన్ చంపిన జహంగీర్..

    కరీనా కపూర్ తన రెండో కొడుకుకు జహంగీర్ ఆలీ ఖాన్ అని పేరు పెట్టుకొన్నారు. సిక్కు మతస్తుల ఐదో గురువు గురు అర్జున్‌ను చంపిన జహంగీర్ చక్రవర్తి పేరును కరీనా తన రెండో కొడుకుకు పెట్టుకోవడం ఏమిటి? మొదటి బిడ్డకు తైమూర్ అని పేరు పెట్టుకొని వివాదంగా మలిచిన కరీనా.. తన రెండో కొడుకుకు అలాంటి పేరే పెట్టారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జహంగీర్‌ను కేవలం చంపడమే కాదు... మనదేశాన్ని దోచుకొన్నారు. మన పూర్వీకులను దారుణంగా వధించాడు. ఇలాంటి విషయంలో మనమంతా అప్రమత్తంగా ఉండాలి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

     జహంగీర్ కాదు.. చంఘీజ్ ఖాన్ అని పెట్టుకో

    జహంగీర్ కాదు.. చంఘీజ్ ఖాన్ అని పెట్టుకో

    కరీనా తన మొదటి కొడుకుకు తైమూర్ పేరు పెట్టుకొన్నందున.. తన రెండో కొడుకుకు జహంగీర్ అని కాకుండా చంఘీజ్ ఖాన్ అని పేరు పెట్టుకొంటే బాగుండేది. వికృత చేష్టలకు పాల్పడిన ఇద్దరు పేర్లు పెట్టుకొంటే కరీనా పిల్లలకు బాగుండేది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. భారత్‌లో ఉంటున్న కరీనా కపూర్ తన రెండో కొడుకు మంచి పేరు పెట్టుకొన్నారు. ఇంకో కొడుకు పుడితే చంఘీజ్ ఖాన్ అని పెట్టుకొంటారా? లేదా ఔరంగజేబ్ అని పెట్టుకొంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా జిన్నా, హిట్లర్, మావో, గఢాఫీ లాంటి పేర్లు కూడా పెట్టుకొండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    కరీనా కపూర్ దారుణంగా అంటూ

    కరీనా కపూర్ దారుణంగా అంటూ

    క్రూరమైన ఇస్లాం పాలకులను స్పూర్తిగా తీసుకొని కరీనా కపూర్ తన కుమారుడికి జహంగీర్ అని పేరు పెట్టుకొన్నారు. గురు అర్జన్‌నే కాకుండా దేశంలో చాలా మంది హిందువులను చంపిన రాజు పేరును కరీనా తన కొడుకుకు పెట్టుకోవడం దారుణం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. దేశానికి శత్రువులైన వారి పేర్లు పిల్లలకు పెట్టుకొంటారా? మొఘల్ సంస్కృతిని వ్యాప్తి చేసే ప్రయత్నమా? ఇలాంటి వారి సినిమాలను నిషేధించాలి. కరీనా, సైఫ్ సిగ్గు పడాల్సిన విషయం అంటూ నెటిజన్లు దారుణంగా స్పందిస్తున్నారు.

    ఖిల్జీ అని పెట్టుకోవచ్చుగా అంటూ..

    ఖిల్జీ అని పెట్టుకోవచ్చుగా అంటూ..

    కరీనా కపూర్ తన పిల్లలకు తైమూర్, జహంగీర్ అని పేరు పెట్టుకొన్నప్పుడు.. మన పిల్లలకు ప్రతాప్, శివాజీ, చంద్రగుప్త, పృథ్వీరాజ్ అని తమ బిడ్డలకు పేరు పెట్టుకోవడంలో తప్పు ఏమున్నదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఓ పంజాబీ కపూర్ ఫ్యామిలీకి చెందిన సినీ తార తన బిడ్డలకు తైమూర్, జహంగీర్ అని పేరుపెట్టుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఖిల్జీ ఇంకా వేరే పేర్లు పెట్టుకో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో కరీనాకపూర్, సైఫ్ ఆలీ ఖాన్‌పై మండిపడుతున్నారు.

    Recommended Video

    Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
    వివాదంపై స్పందించని కరీనాకపూర్ దంపతులు

    వివాదంపై స్పందించని కరీనాకపూర్ దంపతులు

    తమ మొదటి కుమారుడు తైమూర్ మాదిరిగానే రెండో బిడ్డ పేరు జహంగీర్ వివాదం కావడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివాదంపై కరీనా, సైఫ్ స్పందిస్తారా? లేక మౌనంగానే ఉంటారా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే కరీనా, సైఫ్‌ను టార్గెట్ చేస్తూ విపరీతంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Bollywood star Kareena Kapoor Khan named her second son as Jahangir, In this occassion, Netizens brutally trolloing Saif Ali Khan and Kareen Kapoor couple.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X