ఇప్పటి వరకూ ఏ సినిమా కోసం ఇలా చేయలేదు.. ఆమిర్ ఖాన్ కోసం తప్పలేదు.. కరీనా కామెంట్స్
కరీనా కపూర్ గురించి తెలియని సినీ ప్రేక్షకులుండరు. తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడి.. తైమూర్ అలీ ఖాన్‌కు జన్మనిచ్చింది. వీరి జంటకు, తైమూర్‌కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ భామ పెళ్లాయక సెకండ్ ఇన్నింగ్స్‌ను ఫుల్ జోష్‌లో మొదలు పెట్టింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. సోనమ్ కపూర్, కరీనా కపూర్ కలిసి చేసిన వీరే దీ వెడ్డింగ్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లో
కరీనాను ముద్దుగా బెబో అని పిలిచే బాలీవుడ్‌లో ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. సల్మాన్, షారూఖ్, అక్షయ్ లాంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన కరీనా.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటిస్తోంది.

ఎన్నో ప్రత్యేకతలతో..
థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఆమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు.

గుడ్ న్యూస్ ప్రమోషన్స్‌లో..
అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన గుడ్ న్యూస్ చిత్ర ప్రమోషన్లలో కరీనా మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో తన తదుపరి చిత్రమైన లాల్ సింగ్ చద్దాపై ఆసక్తికర కామెంట్లు చేసింది. ఇన్ని సంవత్సరాల తన కెరీర్‌లో మొదటిసారి ‘లాల్ సింగ్ చద్దా' కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్నానని కరీనా వెల్లడించింది.

ఆమిర్ కోసం తప్పలేదు..
అంతేకాకుండా ఆమీర్ ఖాన్ కోసం స్క్రీనింగ్ టెస్ట్‌లో కూడా ఆమె పాల్గొన్నట్లు తెలిపింది. ‘నా కెరీర్‌లో ఆడిషన్స్‌లో పాల్గొన్న మొదటి సినిమా ‘లాల్ సింగ్ చద్దా'. ఇప్పటి వరకూ నేను ఏ సినిమా కోసం ఇలా చేయలేదు. ఈ ప్రపంచంలో ఆమీర్ కోసం తప్ప మరెవరి కోసం ఇలా చేయను' అని కరీనా చెప్పుకొచ్చింది. మరోవైపు ఆమె ‘అంగ్రేజీ మీడియం', ‘తఖ్త్' సినిమాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











