For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డెలివరీ తర్వాత ఆ పోస్టుతో షాకిచ్చిన కరీనా: కొడుకు గురించి చెబుతుందనుకుంటే.. అలా ప్రకటించింది

  |

  కరీనా కపూర్.. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తూ.. దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న హీరోయిన్. హిందీలోని సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరు హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. సినిమాలతో పాటు వ్యాపార ప్రకటనల్లోనూ తన సత్తా చాటింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇటీవలే రెండో బాబు పుట్టాడు. ఈ నేపథ్యంలో డెలివరీ తర్వాత కరీనా కపూర్ తొలిసారి ఓ పోస్ట్ చేసింది. అయితే, అది కొడుకు గురించి మాత్రం కాదు. వివరాల్లోకి వెళ్తే...

  అలా పరిచయమైన కరీనా కపూర్

  అలా పరిచయమైన కరీనా కపూర్

  2000 సంవత్సరంలో వచ్చిన ‘రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది కరీనా కపూర్. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఆఫర్లను కూడా అందుకుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు వరుస సినిమాలు చేసిందామె.

  బాలీవుడ్ హీరోతో ప్రేమ వివాహం

  బాలీవుడ్ హీరోతో ప్రేమ వివాహం

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే కరీనా కపూర్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అంతకంటే ముందు నుంచే అతడితో ప్రేమాయణం సాగించిన ఈ భామ.. కొన్నేళ్లకు అగ్నిసాక్షిగా అతడితో తాళి కట్టించుకుంది. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం అయింది. దీనికి కారణం సైఫ్ అలీ ఖాన్‌కు అంతకు ముందే మరొకరితో పెళ్లి జరగడం.. విడిపోవడమే.

  కరీనాకు కొడుకు.. హాట్ టాపిక్‌గా

  కరీనాకు కొడుకు.. హాట్ టాపిక్‌గా

  సైఫ్ అలీ ఖాన్‌తో వివాహం జరిగిన నాలుగేళ్లకు కరీనా కపూర్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడి పేరు తైమూర్ అలీ ఖాన్. ఈ సినీ జంట ఎక్కడకు వెళ్లినా ఈ బుడ్డోడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. అతడి ఫొటోలను తరచూ ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో బాగా పాపులర్ అయిపోయాడు. అతడికి తైమూర్ అని పేరు పెట్టినప్పుడు కూడా వివాదం అయింది.

  రెండో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా

  రెండో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా

  గత ఏడాది మరోసారి గర్భం దాల్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. ఈ క్రమంలోనే గత ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సైఫ్ అలీ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించాడు. అంతేకాదు, పుత్రోత్సహంతో కరీనా నుదిటిపై ముద్దు పెడుతోన్న ఓ ఫోటోను షేర్ చేశాడు.

  డెలివరీ తర్వాత ఆ పోస్టుతో షాక్

  డెలివరీ తర్వాత ఆ పోస్టుతో షాక్

  తమకు రెండో బిడ్డ పుట్టినట్టు సైఫ్ అలీ ఖాన్ అదే రోజు వెల్లడించగా.. కరీనా కపూర్ నుంచి వచ్చే ఆ పోస్టు కోసం ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాతృత్వ ఆనందాన్ని ఆమె ఏ విధంగా వ్యక్తపరుస్తుందో అని అంతా చర్చించుకుంటోన్న సమయంలో ఈ బాలీవుడ్ హీరోయిన్ అందరినీ షాక్‌కు గురి చేసింది. దీనికి కారణం ఆమె మొదటి పోస్టులో వేరే విషయాన్ని చెప్పడమే.

  కొడుకు గురించి కాకుండా.. అలా

  కొడుకు గురించి కాకుండా.. అలా

  డెలివరీ తర్వాత కరీనా కపూర్ ఇంటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో బిడ్డను కన్న తర్వాత తొలిసారి చేసిన పోస్టులో తన భర్త సైఫ్ అలీ ఖాన్ నటిస్తోన్న ‘బూత్ పోలీస్' అనే సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె బిడ్డకు సంబంధించిన పోస్ట్ కాకుండా వేరేది చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

  English summary
  Kareena Kapoor Khan is back home from the hospital after she welcomed Saif Ali Khan and her second child. Soon after the photos of actor heading came out, Bebo jumped on to Instagram to share a new update. No, Kareena didn't update about her newborn son but dedicated to another special person in her life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X