ఆంటీ.. నీ వయసుకు తగ్గ డ్రస్ వేసుకో.. కరీనాను దారుణంగా.. బాత్రూం ఫోటోలు కూడా షేర్!

Recommended Video

Kareena Kapoor Khan Says 'People Are So Ignorant Towards Celebrity Feelings | Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ అఫిషియల్‌గా అకౌంట్ లేకపోయినా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. అయితే అందరూ సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడినట్టే తనకు ఈ సమస్య తప్పడం లేదు. తాజాగా తనకు డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేయడం మీడియాలో ప్రముఖంగా మారింది. తనపై వచ్చిన ట్రోలింగ్‌పై కరీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఏమన్నారంటే..

 వయసుకు తగ్గ డ్రస్సులు వేసుకో

వయసుకు తగ్గ డ్రస్సులు వేసుకో

తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్వహించిన వెబ్ చాట్ షో పించ్‌కు కరీనా కపూర్ హాజరైంది. ఈ సందర్భంగా తన గురించి వచ్చిన ట్రోలింగ్ ట్వీట్‌ ఆమె దృష్టికి తీసుకొచ్చారు. కరీనా అంటీ.. నీ వయసుకు తగిన డ్రస్సులు వేసుకో అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లపై ఆమె స్పందించారు.

 సెలబ్రిటీ‌లకు ఫీలింగ్స్ ఉండవా?

సెలబ్రిటీ‌లకు ఫీలింగ్స్ ఉండవా?

సెలబ్రిటీలంటే ప్రజలకు చులకనభావం ఏర్పడింది. వారికి మా ఫీలింగ్స్‌ పట్టించుకోవడం లేదు. సెలబ్రిటీలకు, హీరో, హీరోయిన్లకు ఫీలింగ్స్ ఉండవా? వారి గురించి ఎందుకు ఆలోచించరు. ఏమన్నా భరించాల్సిందే. మా మనోభావాలను ఎవరూ పట్టించుకోరూ అంటూ కరీనా ఆవేదన వ్యక్తం చేశారు.

 యాక్టర్లంటే ఇప్పుడు గౌరవం లేదు

యాక్టర్లంటే ఇప్పుడు గౌరవం లేదు

యాక్టర్లంటే ప్రజలకు గౌరవం పోయిందనే కరీనా కపూర్ గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. పాతతరం నటులంటే ప్రజలకు గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం సెలబ్రీటీలు కూడా దిగజారి ప్రవర్తిస్తున్నారు. బాత్రూం ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసే దుస్థితి నెలకొంది అని కరీనా అన్నారు.

కరీనా కపూర్, అక్షయ్ కుమార్ జంటగా గుడ్ న్యూస్

కరీనా కపూర్, అక్షయ్ కుమార్ జంటగా గుడ్ న్యూస్

ఇదిలా ఉండగా, కరీనా కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. కరణ్ జోహర్ రూపొందించే గుడ్ న్యూస్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జంటగా కనిపించబోతున్నారు. ప్రెగ్నెన్సీ సమస్యలపై దంపతుల మధ్య తలెత్తే అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రం సెప్టెంబర్ 6న రిలీజ్ కాబోతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X