కరీనాకపూర్ తండ్రిని ఐసీయూకు తరలింపు.. కరోనా పాజిటివ్‌తో హాస్పిటల్‌లో..
కరోనావైరస్ బారిన పడిన కరీనాకపూర్ తండ్రి, ప్రముఖ నటుడు రణ్‌ధీర్ కపూర్‌ను ఐసీయూకు తరలించినట్టు హస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అయితే రణ్‌ధీర్ కపూర్‌తోపాటు ఆయనకు సంబంధించిన ఐదుగురు సిబ్బందికి కూడా కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో వారికి కూడా చికిత్సను అందిస్తున్నట్టు తెలిసింది.

కోకిలాబెన్ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రణ్‌ధీర్ కపూర్ పరిస్థితి మెరుగుపడుతున్నట్టు సమాచారం. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... తనను ఐసీయూకు షిఫ్ట్ చేశారు. తదుపరి రోగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. హాస్పిటల్ వర్గాలు బాగా చూసుకొంటున్నారు. అందుకు టీనా అంబానీకి థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. నా ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ అంశం కంట్రోల్‌లోనే ఉంది. ప్రతీ క్షణం వైద్యులు నా చుట్టూ ఉంటున్నారు అని రణధీర్ కపూర్ వెల్లడించారు.
కోకిలాబెన్ హాస్పిటల్‌లో సాధారణ గదిలో చేరిన రణ్‌ధీర్ కపూర్‌ను ప్రస్తుతం ఐసీయూకు తరలించి ఆక్సిజన్ అందిస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











