ఆయనకు ఇద్దరు పిల్లలు.. అయినా ప్రేమించా.. పెళ్లి చేసుకుంటానని మా అమ్మని అడిగారు!
కరీనా కపూర్ తన వ్యక్తిగత విషయాలని బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడరు. నటిగా రాణిస్తున్నా ఆమెకు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు. తన ముద్దుల కొడుకు ఇంతలా సెలెబ్రిటీ అయిపోవడం కూడా తనకు ఇష్టం లేదని, తైమూర్ అందరిపిల్లల లాగా స్వేచ్ఛగా పెరగాలని కోరుకుంటాని పలు సంధర్భాల్లో కరీనా కపూర్ తెలిపింది. ఇదిలా ఉండగా కరీనా కపూర్ హ్యుమన్స్ ఆఫ్ బాంబే మీడియా సంస్థ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కరీనా కపూర్ తన వ్యక్తిగత విషయాలని వెల్లడించారు. సైఫ్ తో ప్రేమ, పెళ్లి లాంటి లాంటి విషయాల గురించి కరీనా తొలిసారి స్పందించారు.

కెరీర్ ముగిసిందనుకున్నా
కరీనా కపూర్ మాట్లాడుతూ.. మా అక్క కరిష్మా కపూర్ ని చూసి నేను కుడా నటిని కావాలని అనుకున్నా. కరీర్ ఆరంభంలో అద్భుతమైన అవకాశాలు, విజయాలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. నాకు కుడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఏడాది మొత్తం అవకాశాలు రాలేదు. నా కెరీర్ ముగిసిపాయిందని అనుకున్నా. అలాంటి సమయంలో నా కుటుంబ సభ్యులతో పాటు.. సైఫ్ అలీ ఖాన్ తనకు అండగా నిలిచారని కరీనా కపూర్ తెలిపింది.

ఆయనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు
టషన్ సినిమా షూటింగ్ సమయంలో సైఫ్ పై నాకున్న అభిప్రాయం పూర్తిగా మరిపాయింది. ఆయన ప్రేమలో పడిపోయా. సైఫ్ కు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసు. నా కంటే వయసులో పదేళ్ళు పెద్ద. కాని నా మనసు ఆయన్నే కోరుకుంది. నాపై నాకు నమ్మకాని పెంచిన వ్యక్తి ఆయన. జీవితంలో ఎలా ముందుకు సాగాలో సైఫ్ ని చూసే నేర్చుకున్నాను అని కరీనా కపూర్ తెలిపింది. షూటింగ్ ముగిశాక ఇద్దరం బైకులో తిరిగేవాళ్ళం అని కరీనా తెలిపింది.

అంగీకారంతోనే
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మా అమ్మతో మాట్లాడింది సైఫే. మా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేదు. అందరి అంగీకారంతోనే మా వివాహం జరిగింది. మా ప్రేమకు ప్రతిరూపంగా తైమూర్ పుట్టాడని కరీనా వెల్లడించింది. తైమూర్ లేకుండా తను ఒక్క క్షణం కుడా ఉండలేనని కరీనా తెలిపింది .

ఆ పరిస్థితి లేదు
ఛాలా మందికి పెళ్ళయ్యాక కుటుంబ భాద్యతలు పెరుగుతాయి. కాబట్టి కెరీర్ కు దూరమవుతుంటారు. నాకు అలాంటి పరిస్థితి లేదు.కుటుంబాన్ని, కెరీర్ ని బ్యాలన్స్ చేసుకోగలుగుతున్నా అని కరీనా కపూర్ తెలిపింది. కెరీర్ పరంగా అనేక కష్టాలు ఎదుర్కొన్న తనకు కుటుంబం విషయంలో మాత్రం ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని కరీనా కపూర్ తెలిపింది.


Click it and Unblock the Notifications











