డిఫెన్స్ మినిస్ట్రీ వద్ద పెండింగులో... జాహ్నవి కపూర్ మూవీ, ఏం జరుగుతోంది?
'యురి: ది సర్జికల్ స్ట్రైక్' మూవీ భారీ విజయం అందుకున్న తర్వాత బాలీవుడ్లో దేశభక్తికి సంబంధించిన అంశాలతో తీసే చిత్రాల సంఖ్య పెరిగింది. ఇందులో జాహ్నవి కపూర్ నటిస్తున్న 'కార్గిల్ గర్ల్', సిద్ధార్థ్ మల్హోత్రా చేస్తున్న కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ తదితర చిత్రాలు ఉన్నాయి.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. విక్రమ్ బాత్రా బయోపిక్‌కు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. అయితే జాహ్నవి కపూర్ 'కార్గిల్ గర్ల్' మూవీకి అనుమతి లభించాల్సి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

అనుమతి రాక పోయినా షూటింగ్ షురూ
జాహ్నవి కపూర్ చిత్రానికి ఇంకా రక్షణ శాఖ నుంచి అనుమతి లభించక పోయినప్పటికీ షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రం ఇండియన్ తొలి ఎయిర్‌ఫోర్స్ ఉమెన్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. గుంజన్ సక్సెనా కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు.

కార్గిల్ గర్ల్
కార్గిల్ గర్ల్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరిలోనే లక్నోలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆమె సోదరుడి పాత్రలో అంగద్ బేడీ నటిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి జాహ్నవి కపూర్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు.

జాహ్నవి సిన్సియర్ యాక్టర్
కార్గిల్ గర్ల్ చిత్రం గురించి పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ...‘ఈ చిత్రంలో నేను చేస్తున్న పాత్ర ఎంతో నచ్చింది. షూటింగ్ సమయంలో అంతా సరిదాగా గడిపాం. జాహ్నవి కపూర్ చాలా సిన్సియర్ యాక్టర్. ఆమె నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ఆమె పనితీరు, కమిట్మెంట్ చూసి ఆశ్చర్యపోయాను' అని పేర్కొన్నారు.

శరణ్ శర్మ దర్శకత్వం
‘కార్గిల్ గర్ల్' చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘శరణ్ అద్భుతమైన టాలెంట్ కలిగిన డైరెక్టర్. అతడు సినిమాను మలిచే విధానం నాకు ఎంతో నచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్‌తో అసోసియేట్ అయి పని చేయడం ఒక మంచి అనుభవం.' అని పంకజ్ తెలిపారు.

విక్రమ్ బాత్రా బయోపిక్
సిద్దార్థ్ మల్హోత్రా నటించబోయే విక్రమ్ బాత్రా బయోపిక్ సహ నిర్మాత షబ్బీర్ బాక్ష్‌వాలా మాట్లాడుతూ... ‘మా చిత్రానికి సంబంధించిన షూటింగ్ మే నెలలో ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ అంతా పూర్తయింది. టైటిల్ కూడా ఫిక్స్ చేశాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలు అఫీషియల్‌గా ప్రకటిస్తాం' అన్నారు.


Click it and Unblock the Notifications











