ప్రముఖ సినీ నిర్మాత, హీరోయిన్‌కు కరోనా.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురికి ప్రాణాంతక వ్యాధి!
బాలీవుడ్ నిర్మాత కుటుంబాన్ని కరోనావైరస్ వెంటాడుతున్నది. ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనావైరస్ సోకడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తాజా రిపోర్టుల ప్రకారం.. నిర్మాత మహ్మాద్ కరీం మోరానీ కూడా కరోనావైరస్ బారిన పడినట్టు వార్తలు అందుతున్నాయి. గతవారం క్రితం ఆయన ఇద్దరు కూతుళ్లు జోయా మోరానీ, షాజా మోరానీ కొవిడ్19కు గురైన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

గతవారం ఇద్దరు కూతుళ్లకు
నిర్మాత కరీం మోరానీ కూతుళ్లు జోయా మోరానీ, షాజా మోరానీ కరోనా పాజిటివ్‌గా తేలారు. జోయా రాజస్థాన్ నుంచి మార్చి 15వ తేదీన రాగా, షాజా శ్రీలంక పర్యటన నుంచి ఇటీవల తిరిగి వచ్చారు. ఆ తర్వాత వారికి కరోనా లక్షణాలు కనిపించాయి. తలనొప్పి, జ్వరంతో బాధపడటంతో వారిని ఫ్యామిలీకి దూరంగా ఉంచాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.

ముంబై హాస్పిటల్స్‌లో చికిత్స
ఇటీవల జోయా, షాజాకు నిర్వహించిన పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో జోయా మోరానీను నానావతి హాస్పిటల్‌లో చేర్పించాం. ఇక షాజా కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారిద్దరూ ఇప్పుడు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నారు అని కరీం మోరానీ తెలిపారు.

తాజాగా నిర్మాతకు కరోనావైరస్
అయితే రెండు రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరీం మోరానీ కూడా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడతుండటంతో పరీక్షలు చేయించారు. ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనను వెంటనే నానావతి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటూ.. ఐసోలేషన్ వార్డులో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.

ధృవీకరించిన ఫ్యామిలీ
మోరానీ సోదరుడు మహ్మద్ మోరానీ మీడియాతో మాట్లాడుతూ.. కరీం, అతని ఇద్దరు కూతుళ్లు కరోనావైరస్ బారిన పడిన విషయం నిజమే. తాజాగా నిర్ధారణ పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వెంటనే అతడిని ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేర్పించాం అని తెలిపారు. ప్రస్తుతం వారిద్దరూ కూడా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

జోయా మోరానీ సినీ కెరీర్
జోయా మోరానీ బాలీవుడ్‌లో పలు సినిమాల నిర్మాణంలో పాలుపంచుకొన్నారు. షారుక్ ఖాన్ ప్రొడక్షన్‌లో రూపొందిన ఆల్వేస్ కభీ కభీ చిత్రంలో పనిచేశారు. ఆ తర్వాత భాగ్ జానీ అండ్ మస్తానీ నటించారు. అలాగే జీ5లో అకూరీ అనే వెబ్ సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి ప్రవేశించారు. చివరిసారిగా భూత్ పూర్వా చిత్రంలో జోయా కనిపించారు.
Recommended Video

కరీం మోరానీ కెరీర్
ఇక కరీం మోరానీ విషయానికి వస్తే.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు. షారుక్‌తో కలిసి చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, రా.వన్ చిత్రాలను రూపొందించారు. షారుక్, కాజల్ నటించిన దిల్‌వాలే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. 2జీ స్ట్రెక్టమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే ఆ మధ్య డాన్ రవి పూజారి జరిపిన దాడి నుంచి తప్పించుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











