సీనియర్ హీరోయిన్ మాజీ భర్త.. కొత్త భార్యతో ఎంజాయ్ మూడ్‌లో ఉన్నాడుగా!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ 2016 లో తన భర్త సంజయ్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. సంజయ్ ఆ తరువాత హాట్ మోడల్ ప్రియా సచ్ దేవ్‌ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం పూర్తి ఏడాది గడవడంతో తొలి వివాహ వార్షికోత్సవాన్ని హ్యాపీగా గడుపుతున్నారు. ఈ మేరకు ప్రియా సచ్ దేవ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
ప్రియా సచ్ దేవ్ తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో కపుల్స్ ఇద్దరూ ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు. ఇలాంటి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరిన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రియా సచ్ దేవ్ తెలిపింది.
ప్రియా సచ్ దేవ్ సంజయ్ కు మూడవ భార్య. సంజయ్ రెండవ భార్య హీరోయిన్ కరిష్మా కపూర్ కావడం విశేషం. 2016 లో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం సంజయ్ 2017 ఏప్రిల్ లో మోడల్ ప్రియా సచ్ దేవ్‌ని వివాహమాడాడు. వీరిద్దరూ 2013 నుంచే సన్నిహితంగా ఉంటున్నారు. సంజయ్, కరిష్మాకు ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు.


Click it and Unblock the Notifications











