స్టార్ హీరోయిన్‌ను వేలం వేసిన భర్త.. తన స్నేహితులతో శృంగారం చేయాలంటూ!

సినీ రంగంలో ఎంతో మంది హీరోయిన్లు ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారిలో కొందరు మాత్రమే భర్తలతో కలిసి జీవిస్తుండగా.. చాలా మంది పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీష్మా కపూర్ ఒకరు. భర్తతో 13 ఏళ్లు కాపురం చేసిన ఈ భామ.. ఆ తర్వాత విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత దీనిపై పలుమార్లు స్పందించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీష్మా కపూర్.. తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతులు మీకోసం!

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్
కపూర్ ఫ్యామిలీకి చెందిన కరీష్మా కపూర్ 'ప్రేమ ఖైదీ' అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది. అలా దాదాపు పదేళ్ల పాటు ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రికార్డులను కరీష్మా సొంతం చేసుకుంది.

Karisma Kapoor Sensational Comments on Ex Husband Sunjay Kapur

సంజయ్ కపూర్‌తో వివాహం
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న సమయంలోనే కరీష్మా కపూర్.. అజయ్‌ దేవగణ్‌తో ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పిన ఈ భామ.. అభిషేక్ బచ్చన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కానీ, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే అంటే.. 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను కరీష్మా కపూర్ వివాహం చేసుకుంది.

13 ఏళ్ల తర్వాత విడాకులు
సంజయ్ కపూర్‌తో వివాహం జరిగిన తర్వాత కూడా కరీష్మా కపూర్ కెరీర్‌ను కంటిన్యూ చేసింది. అదే సమయంలో వైవాహిక జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేసింది. ఇలా ఈ స్టార్ హీరోయిన్ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే, ఆ తర్వాత సంజయ్ కపూర్‌తో విబేధాలు రావడంతో 2016లో కరీష్మా కపూర్ అతడికి విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో ఇది సంచలనం అయింది.

Karisma Kapoor Sensational Comments on Ex Husband Sunjay Kapur

పెళ్లైన నాటి నుంచే హింస
భర్త సంజయ్ కపూర్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కరీష్మా కపూర్ తన వైవాహిక జీవితం గురించి ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి దీనిపై కరీష్మా స్పందించింది. 'పెళ్లైన నాటి నుంచే సంజయ్ నన్ను చిత్ర హింసలకు గురి చేశాడు. నాపై శారీరకంగా దాడి చేశాడు. మానసికంగా హింసించాడు' అని చెప్పింది.

హనీమూన్‌లో వేలం వేశాడు
తాజా ఇంటర్వ్యూలో కరీష్మా కపూర్ మాట్లాడుతూ.. 'పెళ్లైన తర్వాత సంజయ్ నన్ను హనీమూన్‌ కోసం తీసుకెళ్లాడు. అక్కడకు తన స్నేహితులను కూడా తీసుకు వచ్చాడు. అప్పుడు వాళ్ల ముందు నన్ను నిల్చోబెట్టి వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బు కోట్ చేస్తారో వాళ్లకు ఇస్తానని చెప్పాడు. ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం' అని ఆవేదన వ్యక్తం చేసింది.

Karisma Kapoor Sensational Comments on Ex Husband Sunjay Kapur

ఫ్రెండ్స్‌తో శృంగారం అని
కరీష్మా కంటిన్యూ చేస్తూ.. 'వేలం తర్వాత తన స్నేహితులతో శృంగారం చేయమని సంజయ్ నన్ను బలవంత పెట్టాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. నాతో పెళ్లి తర్వాత కూడా తన మొదటి భార్యతో సంజయ్ ఎఫైర్ కంటిన్యూ చేశాడు. ఇది తెలిసి ఎదురు తిరిగితే నాపై దాడి చేశాడు. అతడి మదర్ కూడా నన్ను చిత్ర హింసలు పెట్టింది' అంటూ వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X