twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌కు న్యాయం జరగకపోతే.. జాతీయ రహదారుల దిగ్బంధం.. కర్ణిసేన వార్నింగ్

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా ఊపందుకొంటున్నది. బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ర్యాలీలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు సుశాంత్ సింగ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన శ్రీ రాజ్‌పుత్ కర్నిసేన అలియాస కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమెది బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా #IndiaDemandsCBIForSSR అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అందరూ కలిసి రావాలని కర్ణిసేన కోరుతున్నది. సుశాంత్ సింగ్ మరణంపై సుఖ్‌దేవ్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ...

    Recommended Video

    #IndiaDemandsCBIForSSR : Karni Sena Warning ఎన్నికల్లో రాజకీయ పార్టీలను బహిష్కరిస్తాం ! || Oneindia
    ఖాన్ల కుటుంబాలు, అండర్ వరల్డ్ హస్తం

    ఖాన్ల కుటుంబాలు, అండర్ వరల్డ్ హస్తం


    సుశాంత్ సింగ్ మృతిపై కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ... యువ హీరో మరణం వెనుక ఖాన్ కుటుంబాల హస్తం ఉంది. ఈ కేసులో వారి నిజస్వరూపాన్ని బయటకు తీసుకురావాలంటే, అండర్ వరల్డ్ కుట్రలను వెలుగులోకి తేవాలంటే సీబీఐ దర్యాప్తు చేయాల్సిందే. దేశంలోని అన్ని పార్టీల నేతలను కలిసి ప్రభుత్వానికి విన్నపాలను సమర్పించాలని కోరుతాను అని సుఖ్ దేవ్ అన్నారు.

     100 రోజులపాటు అఖండ జ్యోతి

    100 రోజులపాటు అఖండ జ్యోతి

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. అతడిని ఆత్మహత్య కాదు.. పకడ్బందీగా హత్య చేశారు. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సుశాంత్ సింగ్‌కు న్యాయం జరిగేంత వరకు అఖండ జ్యోతిని వెలిగిస్తాం. 100 రోజులపాటు దీపాన్ని వెలిగించి న్యాయం కోసం పోరాడుతాం. 100 రోజుల తర్వాత కూడా ప్రభుత్వాలు స్పందించకపోతే జాతీయ రహదారులను అడ్డుకొంటాం అని సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు.

    అవసరమైతే రాజకీయ పార్టీలను బహిష్కరిస్తాం

    అవసరమైతే రాజకీయ పార్టీలను బహిష్కరిస్తాం

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో అండర్ వరల్డ్ పాత్ర ఉంది. అందుకే మేము సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. అండర్ వరల్డ్ ప్రభావంతోనే కొన్ని శక్తులు బాలీవుడ్‌లో అరాచకాలు చేస్తున్నారు. సుశాంత్ సింగ్‌కు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తు తప్పనిసరి. మా విన్నపాన్ని పట్టించుకోకపోతే రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలను బహిష్కరిస్తాం అని సుఖ్ దేవ్ సింగ్ హెచ్చరించారు.

     సన్నిడియోల్‌, వివేక్ ఒబేరాయ్‌ని తొక్కేశారు

    సన్నిడియోల్‌, వివేక్ ఒబేరాయ్‌ని తొక్కేశారు

    గతంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీసిన సన్నిడియోల్‌ను తొక్కేశారు. అలాగే వివేక్ ఒబేరాయ్, కంగన రనౌత్‌ను పైకి ఎదగకుండా వారి కెరీర్లను నాశనం చేశారు. ఇప్పడు సుశాంత్‌ను కూడా లేకుండా చేశారు. ఆరు సినిమా ఆఫర్లను వెనక్కి తీసుకొన్నారు. పాకిస్థాన్‌లో పర్యటించే, అండర్ వరల్డ్ డాన్లకు సహకరించే వారికే బాలీవుడ్‌లో అవకాశాలు లభిస్తాయి. ఇలాంటి కుట్రలను ఛేదించాలంటే సీబీఐ దర్యాప్తు తప్పనిసరి అని సుఖ్‌దేవ్ సింగ్ అన్నారు.

    వారికి నార్కో పరీక్షలు జరపాలి

    వారికి నార్కో పరీక్షలు జరపాలి

    సుశాంత్ సింగ్ మరణం వెనుక వాస్తవాలు బయటకు రావాలంటే సిబ్బందికి, ఆయన స్నేహితులు, సన్నిహితులకు నార్కో అనాలిసిస్ టెస్టులు నిర్వహించాలి. అప్పుడే సుశాంత్ విషయంలో ఏం జరిగిందనేది బయటకు వస్తుంది. ఈ విషయాలను చర్చించడానికి మేము సుశాంత్ సింగ్ కుటుంబాన్ని కలిశాం. వారు కూడా సీబీఐ దర్యాప్తు జరిపించాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో మేము అన్ని రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను కలిసి మా వినతి పత్రాలను సమర్పించి, సీబీఐ దర్యాప్తకు ఆదేశించాలని ఒత్తిడి తెస్తాం అని సుఖ్‌దేవ్ పేర్కొన్నారు.

    English summary
    Karni Sena President Sukh Dev Singh gogamedi demands CBI inquire on Sushant Singh Rajput Committed Suicide. He doubts Under worlds hand behind the Sushant Singh death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X