twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్లు పీకేస్తాం.. నాలుక చీరేస్తాం.. ఇంట్లోకి వచ్చి దాడి.. సినీ రచయిత జావెద్ అఖ్తర్‌కు వార్నింగ్

    |

    బుర్ఖా నిషేధం వివాదం ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ మెడకు చుట్టుకొన్నది. బుర్ఖాను నిషేధించాలనే డిమాండ్ నేపథ్యంలో జావెద్ అఖ్తర్ స్పందిస్తూ.. రాజస్థాన్‌లో కూడా మహిళలు ముసుగులు వేసుకోవడంపై కూడా నిషేధం విధించాలని జావేద్ అఖ్తర్ అభిప్రాయపడ్డారు. అయితే జావేద్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ.. కర్నిసేన తీవ్రమైన హెచ్చరికలు చేసింది. ఇంతకు ఈ వివాదంలో జావేద్ అఖ్తర్‌కు ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందంటే..

    ముసుగు తొలగించాలనేది తప్పు

    ముసుగు తొలగించాలనేది తప్పు

    రాజస్థాన్ మహిళల ముసుగులపై నిషేధం విధించాలని జావేద్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలు తప్పు. మూడు రోజుల్లోగా ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని మహారాష్ట్ర కర్ణిసేన అధ్యక్షుడు జీవన్ సింగ్ సోలంకి హెచ్చరించారు. అంతేకాకుండా ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

     క్షమాపణ చెప్పకపోతే దాడి

    క్షమాపణ చెప్పకపోతే దాడి

    రాజస్థాన్ మహిళల మనోభావాలను కించపరిచే విధంగా జావేద్ అఖ్తర్ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఆయన కళ్లు పీకేస్తాం. నాలికి చీరేస్తాం. ఇంట్లోకి దూరి ఆయనపై దాడి చేస్తాం అని సోలంకి హెచ్చరించారు. జావెద్ అఖ్తర్ మాటలకు కొందరు మద్దతు తెలుపగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్ చేశారు.

    నా వ్యాఖ్యలు వక్రీకరించారు

    నా వ్యాఖ్యలు వక్రీకరించారు

    కర్నిసేన వార్నింగ్‌పై జావేద్ అఖ్తర్ స్పందించారు. కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. మహిళా సాధికారిత గురించి మాట్లాడాను. భద్రతా కారణాల శ్రీలంకలో ముసుగులు, బుర్ఖాలు ధరించడంపై నిషేధం విధించారు. అది బుర్ఖా అయినా.. ముసుగైనా కానీ.. దానిని తొలగించాల్సిందేనని అన్నాను. కానీ ఏ మహిళ మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు.

    కర్ణిసేన ఆందోళనలు

    కర్ణిసేన ఆందోళనలు

    సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావత్ చిత్రం విడుదల సందర్భంగా తలెత్తిన వివాదం నేపథ్యంలో కర్ణిసేన సంఘం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో కర్ణిసేన మద్దతుదారులు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కూడా దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే మణికర్ణిక విడుదల సమయంలో కూడా కర్ణిసేన ఆందోళన చేసింది. తాజాగా జావేద్ అఖ్తర్ టార్గెట్‌గా చేసుకొని వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ మీడియాలో ప్రముఖంగా మారింది.

    English summary
    Bollywood celebrity Javed Akhtar hit headlines when he commented on the burqa ban controversy. His statements have upset a fringe outfit, which calls themselves Karni Sena. Karni Sena warns "We will gouge out your eyes and pull out your tongue if you don't apologise. We will enter your house and beat you."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X