‘దోస్తానా 2’ అఫీషియల్: ఇద్దరు ‘గే’లు... మధ్యలో జాహ్నవి కపూర్!
2008లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'దోస్తానా' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ సూపర్ కలెక్షన్లు సాధించింది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం ఇందులో 'గే'లు నటించిన సంగతి తెలిసిందే.
దాదాపు 11 ఏళ్ల తర్వాత 'దోస్తానా' సీక్వెల్ ప్రకటించారు ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉండే ఈ చిత్రంలో.... కార్తీక్ ఆర్యన్, జాహ్నవి కపూర్ ఖరారయ్యారని, మరో హీరో ఫైనల్ కావాల్సి ఉందని తెలిపారు. ఈ చిత్రానికి కొల్లిని డికన్హా దర్శకత్వం వహించబోతున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ బేనర్లో తెరకెక్కబోతోంది.

దేశీ బాయ్ అండ్ గర్ల్ మ్యాడ్‌నెస్
ఈ సినిమా గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ‘దోస్తానా' ఫ్రాంచైజీని కొనసాగించడం ఆనందంగా ఉంది, కార్తీక్ ఆర్యన్, జాహ్నవి కపూర్ ఫైనల్ అయ్యారు. ఇద్దరూ తెరపై దేశీ బాయ్ అండ్ గర్ల్ మ్యాడ్‌నెస్ క్రియేట్ చేయబోతున్నారు. మా ధర్మా ప్రొడక్షన్స్ బేనర్లో కార్తీక్ ఆర్యన్ చేస్తున్న తొలి చిత్రం. ఈ సినిమా ద్వారా మరో హీరోను పరిచయం చేయబోతున్నాం. త్వరలో అతడికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తాం. కొల్లిన్ డికున్హాకు సైతం దర్శకుడిగా ఇది తొలిచిత్రం' అన్నారు.

గతంలో అలియా భట్ పేరు
కార్తీక్ ఆర్యన్, జాహ్నవి కపూర్ పేర్లు ప్రకటించడానికి ముందు ‘దోస్తానా 2' గురించి రకరకాల ప్రచారం జరిగింది. ఇందులో అలియా భట్, జాన్ అబ్రహం, రాజ్ కుమార్ రావు నటించబోతున్నట్లు రూమర్లు వినిపించాయి. అయితే వార్తలను కరణ్ జోహార్ ఖండించారు.

దోస్తానా
‘దోస్తానా' చిత్రం నవంబర్ 14, 2008లో విడుదలైంది. తరుణ్ మన్‌సుఖాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘గే'లుగా డ్రామా ఆడతారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రియాంకపై మనసు పారేసుకుంటారు. ఈ ముగ్గురి మధ్య సాగే లవ్ ట్రాక్ కామెడీ నేపథ్యంలో నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

జాహ్నవి కపూర్
జాహ్నవి కపూర్ సినిమాల విషయానికొస్తే.... బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ ‘తక్త్'లో నటిస్తోంది. ఇందులో ఆమె రణవీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్, విక్కీ కౌశల్ లాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. దీంతో పాటు గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తోంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత జాహ్నవి స్థాయి మరింత పెరుగుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











